తెలుగుదేశం పార్టీల యువ నేతలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి సీట్ల కేటాయింపు కూడా పెరిగింది. గత ఎన్నికల్లో ఆశించిన మేర యువ నేతలకు సీట్లు ఫిక్స్ చేయలేదు…అటు యూత్ ఓటింగ్‌ని ఆకట్టుకునేలా టిడిపి పనిచేయలేదు. అందుకే భారీ ఓటమిని మూటగట్టుకుంది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని టిడిపి పనిచేస్తుంది. ఇప్పటికే టిడిపిలో యువ నేత నారా లోకేష్ నాయకత్వం బలపడుతుంది. ఆయన పాదయాత్రతో దూసుకెళుతున్నారు.


ఇటు టిడిపిలో యువ నేతల హవా పెరుగుతుంది..అదే సమయంలో కొందరు యువ నేతలకు సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు యువ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో కొందరు సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగాలని చూస్తున్నారు. ఇక వారికి సీట్లు దక్కుతాయా? లేదా? అనేది చూడాలి. టిడిపిలో మొదట నుంచి పనిచేస్తున్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు..తన వారసుడు చింతకాయల విజయ్‌ని అనకాపల్లి ఎంపీ బరిలో దింపాలని చూస్తున్నారు. కానీ విజయ్ సీటు విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

అటు జ్యోతుల నెహ్రూ సైతం..తన వారసుడు నవీన్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా నవీన్ పనిచేస్తున్నారు. మరి ఆయనకు సీటు దక్కుతుందో లేదో చూడాలి. ఇటు అమలాపురం సీటు దివంగత బాలయోగి తనయుడు హరీష్‌కు ఫిక్స్. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని వారసురాలు శ్వేత కూడా సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది.

అలాగే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వారసుడు రంగారావుకు సీటు అడుగుతున్నారు. ఇక కోవూరు సీటు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి తనయుడు దినేష్ రెడ్డికి ఫిక్స్. అటు పరిటాల శ్రీరామ్..ధర్మవరం సీటు ఆశిస్తున్నారు. మరి ఈ సీటు దక్కుతుందో లేదో చూడాలి. మొత్తానికి ఇంకా పలువురు వారసులు రేసులో ఉన్నారు.

