తెలుగుదేశం పార్టీలో ఇద్దరు వియ్యంకులు గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అలా గెలుపు కోసం ఎదురుచూస్తున్న వియ్యంకులు ఎవరో కాదు ఒకరు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరొకరు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. కమ్మ వర్గానికి చెందిన వీరిద్దరికి మొదట రాజకీయ బంధం ఉంది..తర్వాత వ్యాపార బంధం..చివరికి జీవీ తన కుమార్తెని శ్రీధర్ కుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఇద్దరు నేతలు వియ్యంకులు అయ్యారు.


అయితే ఈ ఇద్దరు 2014 ఎన్నికల్లో గెలిచారు. జీవీ ఏమో వినుకొండ నుంచి, శ్రీధర్ పెదకూరపాడు నుంచి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఓటమి పాలయ్యారు. అది కూడా కమ్మ వర్గం నేతల చేటులోనే ఓడిపోయారు. వినుకొండలో జీవీపై బొల్లా బ్రహ్మనాయుడు గెలవగా, పెదకూరపాడులో శ్రీధర్ పై నంబూరు శంకర్ రావు గెలిచారు. కానీ ఆ ఇద్దరు వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా వినుకొండలో బొల్లాకు యాంటీ ఎక్కువ ఉంది. ఆయన అక్రమాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.


ఇటు పెదకూరపాడులో శంకర్ రావు ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. అంటే రెండు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు యాంటీ ఉంది. ఇటు టిడిపిలో ఇద్దరు వియ్యంకులు స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో వారికి గెలుపు అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సారి వినుకొండలో జీవీ…పెదకూరపాడులో శ్రీధర్ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సారి ఇద్దరు వియ్యంకులు గెలుపు గుర్రం ఎక్కేలా ఉన్నారు.

