ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ గా పోటీ చేసి ఒక్క సీటు తెచ్చుకోలేదు. పైగా ఒక్క శాతం ఓట్లు కూడా పడలేదు. అంటే బిజేపి బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే బిజేపి తరుపున పోటీ చేసి గత ఎన్నికల్లో మంచిగా ఓట్లు తెచ్చుకున్న నేతల్లో విష్ణుకుమార్ రాజు కూడా ఒకరు. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఆయన 18, 790 ఓట్లు తెచ్చుకున్నారు.

అంటే కాస్త మంచిగా ఓట్లు తెచ్చుకున్నారు…సొంత ఇమేజ్ వల్లే ఆ మాత్రం ఓట్లు తెచ్చుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేనలతో బిజేపి కలిస్తే విశాఖ నార్త్ సీటులో తాను పోటీ చేయాలని విష్ణు పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అలాగే టిడిపితో పొత్తు ఉండటంతో విశాఖ నార్త్ సీటు బిజేపికి దక్కింది. అక్కడ విష్ణు పోటీ చేసి 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే టిడిపితో పొత్తు వల్లే విజయం సాధ్యమంది. కానీ ఈ సారి ఎన్నికల్లో టిడిపితో కలవమని బిజేపి చెప్పేస్తుంది. అటు టిడిపి-జనసేనలు పొత్తుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో బిజేపిలో ఉంటే మళ్ళీ డిపాజిట్ కోల్పోవడమే..దీంతో కొందరు బిజేపి నేతలు టిడిపి లేదా జనసేనలోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ బిజేపికి రాజీనామా చేసి టిడిపిలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్న విష్ణు సైతం టిడిపిలోకి జంప్ చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు..నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన వేరే సీటులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీంతో విష్ణు టిడిపిలోకి వచ్చి విశాఖ నార్త్ లో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. చూడాలి మరి విష్ణు కూడా టిడిపిలోకి వస్తారో లేదో.
