ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట అని చెప్పాలి. అది కూడా ఇక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పలుమార్లు సత్తా చాటారు. గతంలో పలుమార్లు శ్రీకాళహస్తి నుంచి గెలిచారు. 2014లో కూడా ఆయన గెలిచి మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో అనారోగ్యం వల్ల పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డిని నిలబెట్టారు.

అయితే వైసీపీ వేవ్ లో సుధీర్ దారుణంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి బియ్యం మధుసూదన్ రెడ్డి గెలిచారు. ఓడిపోయాక సుధీర్ మొదట్లో అంత యాక్టివ్ గా పనిచేయలేదు. దీని వల్ల కాళహస్తిలో పార్టీ పికప్ కాలేదు. మధ్యలో చంద్రబాబు సైతం..సుధీర్‌కు క్లాస్ కూడా ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోతే కొత్త ఇంచార్జ్‌ని పెడతానని చెప్పుకొచ్చారు. దీంతో సుధీర్ కాస్త యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. కానీ అనుకున్న మేర కాళహస్తిలో పార్టీ బలపడటం లేదు.

ఇదే సమయంలో తాజాగా కాళహస్తిలో టిడిపిలోకి మాజీ ఎమ్మెల్యే చేరారు. కాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య..తన తనయుడు ప్రవీణ్ తో కలిసి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. అయితే ముని రామయ్య 1985లో టిడిపి నుంచి కాళహస్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆయన టిడిపిలో చేరారు. దీంతో కాళహస్తి టిడిపిలో కొత్త ట్విస్ట్ ఏమైనా వస్తుందా? అనేది చూడాలి.

సుధీర్ రెడ్డిని గాని పక్కన పెడతారా? అనే డౌట్ టిడిపి క్యాడర్ లో వస్తుంది. అయితే బొజ్జల వారసుడుని పక్కన పెట్టడం కాస్త కష్టమనే చెప్పాలి. చూడాలి మరి ఎన్నికల నాటికి కాళహస్తిలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో.
