డీఎల్ రవీంద్రా రెడ్డి…ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు….ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్సార్‌తో సమానంగా కాంగ్రెస్ కోసం కష్టపడిన నేత. కాంగ్రెస్‌లో దశాబ్దాల కాలం పాటు పనిచేసిన డీఎల్…మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు…ఆలగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి సీనియర్ నాయకుడు…రాష్ట్ర విభజన తర్వాత కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడంతో డీఎల్…మళ్ళీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు.

కానీ గత ఎన్నికల ముందు డిఎల్ బయటకొచ్చారు…అసలు టిడిపిలో చేరిపోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు డీఎల్‌కు సీటు ఇచ్చే విషయంలో క్లారిటీ లేకపోవడంతో…ఆయన వైసీపీకి మద్ధతుగా వెళ్లారు. అటు వైసీపీలో కూడా సీటు రాలేదు. దీంతో మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. వైసీపీ నేత శెట్టిపల్లి రఘురామిరెడ్డికి మద్ధతుగా నిలిచారు. ఇక ఆ ఎన్నికల్లో శెట్టిపల్లి విజయం సాధించారు…వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది…కానీ డీఎల్ మళ్ళీ రాజకీయంగా దూరమయ్యారు. వైసీపీలో కూడా ఆయనకు ఎలాంటి పదవులు రాలేదు. అయితే తాజాగా డీఎల్ మీడియా ముందుకొచ్చి…వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని, రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని మాట్లాడారు. దారినపోయే వారందరూ మీడియా సమావేశాలు పెడుతున్నారని, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని చెప్పారు.

డీఎల్ మాటలు బట్టి చూస్తే…వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు గానీ…ఈ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు…డీఎల్ గెలవాలంటే టిడిపినే మరో ఆప్షన్‌గా ఉంది…టిడిపిలోకి వస్తే మైదుకూరు సీటు దక్కడం కష్టం…అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. వేరే నియోజకవర్గాల్లో దిగే ఛాన్స్ లేకపోలేదు. అసలు చూడాలి నెక్స్ట్ డీఎల్ ఏ పార్టీలో చేరుతారు…ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది.
Discussion about this post