వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని… అధికారంలోకి రావాలని.. గట్టిగా నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశగా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని వైపుల నుంచి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసు కుంటోంది. పార్టీని గెలిపించడం అంటే.. అన్ని స్థాయిల్లోనూ.. కృషి ఉండాలని.. చంద్రబాబు నిర్ణయిం చుకున్నారు.. నాయకులను అలెర్టు చేయడం.. వారిని లైన్‌లో పెట్టడం.. ఎక్కడికక్కడ వివాదాలు పరిష్క రించడం.. ఇలా వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

మరోవైపు.. పార్టీని గెలిపించే బాధ్యతలను ఎవరికో ఒక్కరికే కాకుండా… అందరికీ అప్పగించాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామాలు, మండలాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ను.. ఆర్థికంగా.. పార్టీని గట్టెక్కించే బాధ్యతను కూడా చంద్రబాబు తాజాగా ఎన్నారై.. టీడీపీ నాయకులకు అప్పగించారు. అమెరికాలో తాజాగా రెండు రోజులు జరిగిన ఎన్నారై టీడీపీ మహానాడులో చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు..

ఏపీ నుంచి వెళ్లి.. అమెరికాలో స్థిరపడిన ప్రతి తెలుగు దేశం నాయకులు, కార్యకర్త కూడా.. ఇక్కడి తమ తమ జిల్లాల్లో ఉన్న గ్రామీణ స్థాయిలో పార్టీని డెవలప్ చేయాలని ఆయన విన్నవించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలని కూడా సూచించారు. పార్టీని గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేయాలని.. ఒక లక్ష్యం పెట్టుకున్నామని.. దీనిని సాకారం చేసే బాధ్యతను ఎన్నారై టీడీపీ తీసుకోవాలన్నారు. ఇప్పటికే.. ఎన్నారై వర్గం.. ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు..

దీని ద్వారా.. ప్రజలను టీడీపీకి సానుకూలం చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఎవరికి వారు పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకుని.. ముందుకు సాగాలని.. చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీని అభివృద్ధి చేసేందుకు.. ఇక్కడి నేతలను గెలిపించేందుకు.. ఎన్నారైలు సిద్ధమవుతున్నారు.. ఈ పరిణామాలు.. పార్టీలో జోష్‌ను నింపుతుండడం గమనార్హం. ఎందుకంటే.. ఒక వేళ..ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఎన్నారై. నాయకులు సర్దు బాటు చేయడంతోపాటు.. మేధావి వర్గాన్ని కూడా ముందుండి నడిపిస్తారు.

Discussion about this post