వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో టిడిపి బలం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగం స్థానాల్లో టిడిపికి పట్టు పెరిగింది. ఇక నారా లోకేష్ పాదయాత్ర వల్ల టిడిపికి మరింత బలం చేకూరుతుంది. ప్రస్తుతం ఆయన మంత్రాలయంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడ టిడిపి శ్రేణులు ఫుల్ యాక్టివ్ అయ్యారు. అలాగే పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజా స్పందన వస్తుంది. దీని బట్టి చూస్తే మంత్రాలయంలో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుందనే చెప్పాలి.
అయితే ఇక్కడ వైసీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి గెలుస్తున్నారు. ఈయన 2009లో టిడిపి నుంచి గెలిచిన విషయం తెలిసిందే. తర్వాత వైసీపీలోకి వచ్చి గెలుస్తున్నారు. అయితే ఇలా మూడుసార్లు గెలిచిన నాగిరెడ్డి..మంత్రాలయంలో చేసిన అభివృద్ధి తక్కువే. ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే పెద్దగా పట్టించుకోవడం లేదు.

అటు టిడిపి నేత తిక్కారెడ్డి పోరాటం చేస్తున్నారు. పైగా రెండు సార్లు ఆయన ఓడిపోయారు..ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. దీంతో ప్రజలు ఈ సారి తిక్కారెడ్డి వైపు వస్తున్నారు. ఇదే సమయంలో లోకేశ్ పాదయాత్ర సైతం తిక్కారెడ్డికి ప్లస్ అవుతుంది. లోకేష్ సైతం…మంత్రాలయంలో వర్గాల వారీగా సమావేశాలు పెడుతూ..ఓటర్లని ఆకర్షించే పని లో ఉన్నారు. అలాగే పలు హామీలు కూడా ఇస్తున్నారు. దీంతో మంత్రాలయంలో టిడిపికి పట్టు పెరుగుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ తిక్కారెడ్డికే సీటు ఇవ్వనున్నారు. సర్వేలు సైతం ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఈ సారి మంత్రాలయంలో టిడిపి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.