తెలుగుదేశం పార్టీ ప్రత్యర్ధి పార్టీపైనే కాదు..సొంత పార్టీలో ఉన్న శత్రువులపై కూడా పోరాడాల్సిన పరిస్తితి ఉంది. బయట ప్రత్యర్ధులు అంటే తెలుస్తారు గాని..లోపల ఉండే వారు మాత్రం పెద్దగా బయటపడరు. కానీ అంతర్గతంగా పార్టీకి మాత్రం నష్టం చేస్తారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బయటపడి..వైసీపీ కుట్రలు, వేధింపులు, దాడులు, కేసులు తట్టుకుని నిలబడి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇక విజయానికి ఇంకో అడుగు దూరంలో ఉండగా పార్టీలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.
కొందరు నేతలు సొంత పార్టీనే టార్గెట్ చేసి మాట్లాడటం..అలాగే బాబు బిజేపి నేతలని కలిస్తే చాలు..బిజేపి తో పొత్తు ఉంటే టిడిపికి ఓటు వేయమని, నోటాకు వేస్తామని కొందరు మాట్లాడటం పార్టీకి ఇబ్బందిగా మారాయి. అదే ఈ పరిస్తితి వైసీపీలో వస్తే..జగన్ మాట ఎవరు దాటరు. కానీ టిడిపిలో అలా లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు ఉంటున్నారు. అధినేత ఏది పడితే అది నిర్ణయం తీసుకోరు. పార్టీకి మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అవేమీ పట్టించుకోకుండా కొందరు నేతలు, కార్యకర్తలు నానా రచ్చ చేస్తున్నారు. దీంతో టిడిపికి ఇబ్బంది అవుతుంది.

అలాగే గెలిచే వారికే సీట్లు ఇస్తానని బాబు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అదే విధంగా సీట్లు పంపకాలు చేస్తున్నారు. అయితే కొందరికి సీట్లు ఇవ్వకపోవడం వల్ల వారికి అన్యాయం జరిగిపోయినట్లు కొందరు మాట్లాడుతున్నారు. కానీ సీటు దక్కని వారికి బాబు ఏదొక విధంగా న్యాయం చేస్తారని, ముందు పార్టీ గెలవాలనే అంశం ఎవరికి తెలియడం లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ..పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు.
వీటి అన్నిటికి బాబు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. బాబు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నాయకులకు, కార్యకర్తలకు ఉంది. కానీ కొందరు అలా చేయడం లేదు. మరి చూడాలి ఈ అంశాన్ని బాబు సద్దుమనిగేలా చేస్తారా? లేక ఇదే టిడిపికి ఇబ్బందిగా మారుతుందో.