హిందూపురం అనే పేరు వింటే చాలు టీడీపీ కంచుకోట అని చెప్పేయొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మొదట నుంచి హిందూపురం అసెంబ్లీలో గాని, పార్లమెంట్ లో గాని టిడిపి దూకుడు కొనసాగుతూ వస్తుంది. అసెంబ్లీలో టిడిపి ఇంతవరకు ఓడిపోలేదు. కానీ పార్లమెంట్ లో కొన్ని సార్లు ఓడింది. 1984, 1996, 1999, 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.

గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ గెలిచారు. ఇక ఎంపీగా మాధవ్..హిందూపురం పార్లమెంట్ లో చేసిన పని ఏమి లేదు..కానీ ఈయన చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నా సరే రాజకీయంగా జగన్ సపోర్ట్ ఈయనకే ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ మాధవ్ బరిలో దిగుతారా? వేరే నేతని దింపుతారో క్లారిటీ లేదు. ఇటు టిడిపి నుంచి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఉన్నారు. నెక్స్ట్ ఈయనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఈ సారి హిందూపురం పార్లమెంట్ లో టిడిపి జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పార్లమెంట్ పరిధిలో రాప్తాడు, ధర్మవరం, హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, కదిరి, పెనుకొండ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో హిందూపురం తప్ప అన్నీ సీట్లు వైసీపీ గెలిచింది. కానీ ఇప్పుడు సీన్ మారింది..హిందూపురంతో పాటు కదిరి, పెనుకొండ, రాప్తాడు స్థానాల్లో టిడిపికి లీడ్ ఉంది.
అటు పుట్టపర్తిలో కాస్త టఫ్ ఫైట్ ఉంది. ధర్మవరం, మడకశిరలో వైసీపీకి లీడ్ కనిపిస్తుంది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి ఇంకా పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సారి హిందూపురం పార్లమెంట్ టిడిపి ఖాతాలో పడటం ఖాయమే.