అసలు ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో..అప్పటినుంచి చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో రెండోసారి అధికారంలో ఉన్న బీజేపీతో కలిస్తేనే రాజకీయంగా నిలబడగలమని బాబు భావిస్తున్నట్లు, అందుకే మళ్ళీ దగ్గర అవ్వడానికి పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానివ్వడం లేదని కూడా చర్చ వస్తుంది.

ఈ రెండున్నర ఏళ్లుగా ఇదే స్టోరీ నడుస్తున్నట్లు కథనాలు వేస్తున్నారు. తాజాగా బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయని టీడీపీ, పోటీ చేసిన బీజేపీకి పరోక్షంగా మద్ధతు ఇచ్చినట్లు ప్రచారం వచ్చింది. ప్రచారానికి తగ్గట్టుగా పోలింగ్ రోజున కొన్ని చోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు కూర్చున్నారని వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం నడిచింది. ఇక ఏది ఎలా జరిగినా గానీ…బద్వేలులో బీజేపీకి 21 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఆ ఓట్లు టీడీపీ వల్లే వచ్చాయని అంటున్నారు.

ఎందుకంటే గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 735 మాత్రమే. అంటే ఇప్పుడు వచ్చిన ఓట్లు టీడీపీవే అని తెలుస్తోంది. అంటే బీజేపీ-టీడీపీలు ఏకమయ్యాయని చెప్పొచ్చు. కానీ టీడీపీతో అసలు పొత్తు ఉండదని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ తేల్చి చెప్పేశారు. ఇక సునీల్ చెప్పిన, బీజేపీ అధిష్టానం చెప్పిన ఒక్కటే అనే చెప్పొచ్చు. అయితే సునీల్ వ్యాఖ్యలకు….బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెంటనే కౌంటర్ ఇచ్చేశారు.

ఇప్పుడు ఎన్నికలు లేని సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని, ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉందని అన్నారు. పైగా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి చెప్పాల్సిన పని లేదని, పొత్తులని ఇంచార్జ్‌లు డిసైడ్ చేయలేరని, దీనిపై కేంద్ర నాయకత్వంతో మాట్లాడతానని చెప్పారు.

ఇక సీఎం రమేష్…గతంలో చంద్రబాబుకు ఒక రైట్ హ్యాండ్ మాదిరిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక…రాజ్యసభ ఎంపీలుగా ఉన్న రమేష్, సుజనా చౌదరీ, టీజీ వెంకటేష్‌లు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ మాజీ రైట్ హ్యాండ్లు బీజేపీకు బాబుని దగ్గర చేయాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.

Discussion about this post