రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ నేతలు వెనక్కి తగ్గడమే బెటరా.. టీడీపీతో పొత్తు విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి బీజేపీ పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతొ జనసేన పొత్తుకు దాదాపు రెడీ అయిపోయింది. అంతేకాదు.. దీనిపై బహిరంగ ప్రకట నలు కూడా చేస్తోంది.

అయితే.. టీడీపీతో కలిసి ముందుకు పయనించేది లేదని.. బీజేపీ తరచు చెబుతోంది. తాము జనసేనతో నే పొత్తులో ఉన్నామని.. కాబట్టి..ఈ పొత్తు మాత్రమే కొనసాగుతుందని.. అవసరమైతే.. తామె ఒంటరిగానే పోటీకి వెళ్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు. వ్యూహాలు మారుతున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఏపీకి చెందిన కొందరు బీజేపీ కీలక నాయకులు.. పొత్తుల విషయంపై బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

“పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. పొత్తులు పెట్టుకోవాలి. ఇదేమీ తప్పుకాదు. ఎవరూ మినహాయింపు కూడా కాదు. సో.. పొత్తులు పెట్టుకుంటే… పోయేది ఏమీ లేదు“ అని ఏపీకి చెందిన కీలక నేత, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఒకాయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. కూడా రాష్ట్రంలో బలోపేతం అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు పొరుగు పార్టీలతో చేతులు కలిపితే తప్పులేదు. ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాలిన.. తాము చెబుతున్నామన్నారు.

అంతేకాదు.ఇప్పుడు బీజేపీ ఉన్న పరిస్థితిలో కనీసం 10 స్థానాల్లో అయినా.. సత్తా చూపించాలంటే..గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఖచ్చితంగా పొత్తులు.. అందులోనూ టీడీపీతో పొత్తు అవసరమనే వాదాన్ని ఆయన వినిపించారు. ఈ విషయంపై కేంద్రంలోని బీజేపీ కూడా దృష్టి పెట్టిందని.. అన్నారు. “గతంలో ఏదో జరిగింది. వాస్తవమే అయితే. దానినే పట్టుకుని వేలాడితే.. రాజకీయాల్లో ముందుకు పోతామా!“ అని ఆయన ప్రశ్నించారు. మరి బీజేపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Discussion about this post