ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని చెప్పవచ్చు. అధికారికంగా ప్రకటన రాకపోయినా..దాదాపు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందనే ప్రచారం ఎప్పటినుంచో వస్తుంది. కానీ బిజేపి మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అంటుంది. కలిసొస్తే జనసేనతో ఎన్నికలకు వెళ్తామని, జనసేన కూడా రాకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని బిజేపి నేతలు అంటున్నారు.
ఇటు టిడిపి కూడా బిజేపితో పొత్తుకు ఆసక్తిగా లేదు. కాకపోతే కేంద్రంలో బిజేపి అధికారంలో ఉంది..బిజేపికి దగ్గరగా ఉంటేనే కాస్త ఇబ్బందులు ఉండవనే ఆలోచన టిడిపి నేతల్లో ఉంది. అలా అని బిజేపితో కలవడం వల్ల టిడిపికే నష్టం. ఎందుకంటే ఏపీ ప్రజలకు బిజేపిపై ఆగ్రహం ఉంది..విభజన జరిగినా సరే సరిగ్గా న్యాయం చేయలేదనే ఆవేదన ప్రజల్లో ఉంది. ఆ ఆవేదన కాస్త బిజేపిపై ఆగ్రహంగా ఉంది. అందుకే ఇంకా బిజేపికి ఒక్క శాతం ఓట్లు కూడా లేవు.

పైగా బిజేపితో రహస్య స్నేహం చేస్తున్న వైసీపీపై కూడా వ్యతిరేకత ఉంది. అలాంటి సమయంలో బిజేపితో టిడిపి పొత్తు పెట్టుకుంటే నష్టమే. కానీ బిజేపిలో కొందరు నేతలు టిడిపితో పొత్తు ఉంటే గెలవచ్చని చూస్తున్నారు. ఆ నేతలు పొత్తు దిశగా చర్చలు చేస్తున్నారని తెలిసింది. ఇదే క్రమంలో తాజాగా బిజేపి నేత సుజనా చౌదరీ..టిడిపి నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మినారాయణలతో భేటీ అయ్యారు.
పొత్తు గురించి భేటీ అయ్యారా? వేరే కారణం ఉందనేది తెలియదు. ఒకవేళ సుజనా టిడిపిలోకి రావడానికి చూస్తే ఇబ్బంది లేదు..అలా కాకుండా బిజేపితో పొత్తు సెట్ చేయడానికైతే అనవసరమని, అసలు బిజేపితో టిడిపి కలవకూడదని..తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. చూడాలి మరి చివరికి ఏం అవుతుంది.
