తెలంగాణలో చంద్రబాబు అలా ఎంట్రీ ఇచ్చారో లేదో..ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు బాబుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు తెలంగాణలో రాజకీయాలు జోలికి బాబు వెళ్ళడం లేదు. కానీ ఈ మధ్య కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా పెట్టాక..అక్కడ పార్టీలో కాస్త ఊపు కనిపించింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని అక్కడ భారీ సభ పెట్టారు. ఆ సభకు చంద్రబాబు హాజరయ్యారు.

ఆ సభలో ఎన్టీఆర్ గురించి, గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి పనులు గురించి మాత్రమే బాబు చెప్పారు. అలాగే ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన టీడీపీ నేతలు తిరిగి రావాలని కోరారు. అంతేగానీ అక్కడ ఎవరిపై విమర్శలు చేయలేదు. కేసీఆర్ పేరు ఎత్తలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఊసు తీయలేదు. అయితే బాబు ఖమ్మం సభపై మాత్రం స్పదించింది బీఆర్ఎస్ నేతలు మాత్రమే వరుసపెట్టి మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శలు చేశారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని విమర్శించారు. బాబు పాలనలోనే తెలంగాణలో దోపిడీకి గురైందని, ఇక ఇక్కడ బాబుని ఎవరు పట్టించుకోరు అని మాట్లాడారు.

అసలు బాబు ఏమి విమర్శలు చేయకుండానే..బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. అంటే బాబు వల్ల ఏమన్నా తమకు నష్టం జరుగుతుందని చెప్పి ఆవేశ పడి బీఆర్ఎస్ నేతలు స్పందించినట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ టీడీపీ నేతలు బీఆర్ఎస్‌లోకే వెళ్లారు. ఇప్పుడు బాబు పిలుపుతో వారు ఏమన్నా రివర్స్ అవుతారేమో అని భయం బీఆర్ఎస్‌లో ఉండి ఉండవచ్చు.

ఎందుకంటే ఏ మాత్రం బలం లేని టీడీపీ గురించి బీఆర్ఎస్ భయపడాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు ఎంట్రీతో ఎదురుదాడి మొదలుపెట్టారంటే టీడీపీ వల్ల ఎంతోకొంత నష్టం బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుందని భావిస్తున్నట్లు ఉన్నారు.

Leave feedback about this