ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్..మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ సారి ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని, పూర్తి సమయం పాలిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ వారి మాటలు నమ్మడానికి లేదు. కేసీఆర్ ఏ సమయంలోనైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉంది.

ఇక తెలంగాణ విషయం పక్కన పెడితే..ఏపీలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, అందుకనే జగన్ ముందస్తుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని చెప్పి బాబు…టీడీపీ శ్రేణులు ఎన్నికలకు రెడీగా ఉండాలని కోరుతున్నారు. అయితే బాబు మాటలని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. తమకు ప్రజలు పూర్తి సమయం పాలించమని టైమ్ ఇచ్చారని, కాబట్టి పూర్తిగా పాలించాకే..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామ్ని వైసీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన గెలుపు వైసీపీదే అంటున్నారు.

అయితే ఇక్కడ వైసీపీ మాటలు నమ్మడానికి కూడా లేదు. పరిస్తితిని బట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకే మార్చి తర్వాత సీట్లు కూడా ఖరారు చేసేస్తానని ఇటీవల జగన్..వర్క్ షాపులో చెప్పుకొచ్చారు. ఈలోపు ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు.

ఎలా చూసుకున్న వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని, ఆ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి జగన్…ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు 2023 డిసెంబర్‌లో జరుగుతాయి. ఏపీలో షెడ్యూల్ ప్రకారం చూతే ఏప్రిల్ 2024లో వస్తాయి. కానీ తెలంగాణతో పాటే అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లే. మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Leave feedback about this