టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా ఒక మాట చెబుతూ ఉంటారు. అదేంటంటే.. పార్టీలో ఎవరు ఉన్నా.. ఎవరు లేకపోయినా.. పార్టీకి వచ్చిన నష్టం లేదు.. పార్టీ ఎప్పటికప్పుడు.. కొత్త నాయకులను తయారు చేసు కుంటుంది అని! దీనిని ఒకింత లోతుగా చూస్తే.. నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే.. పార్టీ పెట్టిన తర్వా త.. చాలా మంది నాయకులు జంప్ అయ్యారు. నిజానికి అటు కాంగ్రెస్, ఇటు టీడీపీల నుంచి పుట్టిన వారే.. తర్వాత.. ఇతర పార్టీల్లోకి అడుగులు వేశారు. అయితే.. ఎప్పుడూ.. టీడీపీ దీనిని లోటుగా భావించలేదు. అంతేకాదు.. ప్రతి విషయంలోనూన స్పోర్టివ్‌గానే ముందుకు సాగింది.

ఇప్పుడు కూడా పార్టీలో ఒకింత అస్థిరత అయితే.. నెలకొంది. ఎక్కడికక్కడ పార్టీలో కొన్ని ఇబ్బందులు సృ ష్టిస్తున్న నాయకులు నాయకులు కనిపిస్తున్నారు. అయితే.. వారిని చూసి.. పార్టీ ఎక్కడా బెంగ పెట్టుకోలే దు. నిజానికి ఇవన్నీ.. అంటే.. ఆటుపోటులు.. పార్టీకి కొత్తకాదు. ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి వ్యవ హరిం చే టీడీపీ నాయకులను తయారు చేసుకోవడంలోనూ ముందుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా .. ఈ నెల ఆఖరు లేదా.. మహానాడు ముగిన తర్వాత..రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది యువతకు నాయకులుగా శిక్ష ణ ఇచ్చేందుకు చంద్రబాబు వ్యూహం సిద్ధం చేస్తున్నారని టీడీపీ నేతల మధ్య గుసగుస వినిపిస్తోంది.

వీరిని పార్టీలోని సీనియర్ నేతల కుటుంబాల నుంచే కాకుండా… పార్టీలో యాక్టివ్‌గా ఉండి.. ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపునకు నోచుకోని వారికి కూడా శిక్షణ ఇస్తారు. అదేవిధంగా కొత్తగా వచ్చి పార్టీలో చేరాలను కునేవారికి కూడా శిక్షణ ఇచ్చి.. వారిని వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి కార్యకర్తలుగా.. నాయకులుగా తీర్చిది ద్దాలని.. చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే 75 మంది కార్యకర్తలను సెలక్ట్ చేశారని.. మరో 75 మంది కార్యకర్తలను సెలక్ట్ చేసి.. వారికి మూడు విడతల్లో శిక్షణ ఇచ్చి.. కార్యరంగంలోకి దింపుతారని.. అంటున్నారు.

వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైన నేపథ్యంలో.. వీరు.. పార్టీకి వెన్నుదన్నుగా మారుతారని.. చెబుతున్నా రు. మరి ఈ వ్యూహం సక్సెస్ అవ్వాలని.. కార్యకర్తలు, నేతలు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కార్యకర్తలు ఉన్నా.. నాయకులకు కొరత ఉంది. ఈ కొరతను అధిగమించేందుకు పొరుగు పార్టీల నుంచి నేతలను తీసుకునే కన్నా.. సొంతంగా తయారు చేసుకుంటేనే మేలని అంటున్నారట.

Discussion about this post