నారీ భేరి…జగన్ ప్రభుత్వానికి నాంది అంటూ తాజాగా తెలుగు మహిళలు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం దగ్గర నుంచి అనేకమంది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరిగింది. అయితే ఈ దీక్షతో జగన్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని అన్నారు. దీక్షతో పతనం మొదలైందో తెలియదు గాని…టీడీపీ మహిళా నాయకురాళ్ళు రాజకీయంగా బలపడితే మాత్రం అది వైసీపీకి చాలా నష్టం చేస్తుందని చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో మహిళా నేతలు మొత్తం ఓటమి పాలయ్యారు…ఒక్క ఆదిరెడ్డి భవాని మాత్రమే గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మిగిలిన మహిళా నేతలు అంతా ఓడిపోయారు. ఈ సారి గాని వారు సత్తా చాటితే..వైసీపీకి చెక్ పెట్టొచ్చు. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి అవకాశం దొరుకుతుంది. అయితే ఈ సారి టీడీపీలో ఉన్న మహిళా నేతలు సత్తా చాటేలా ఉన్నారు. ఈ సారి ఎక్కువమందికి గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఇప్పటికే వారి ప్రత్యర్ధులుగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే వస్తుంది…అలాగే వైసీపీ పాలన పట్ల కూడా ప్రజలు సంతృప్తిగా లేరు…ఇటు టీడీపీ మహిళా నేతలు ప్రజల్లో ఉంటూ బాగానే పోరాడుతున్నారు. అలా పోరాడే వారిని చూసుకుంటే శ్రీకాకుళంలో గౌతు శిరీష ఉన్నారు..ఈమెకు పలాస నుంచి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం అసెంబ్లీలో గుండా లక్ష్మీ కాస్త కష్టపడాలి. అటు సాలూరులో గుమ్మడి సంధ్యారాణి, విజయనగరంలో అతిథి గజపతిలకు మంచి అవకాశాలు ఉన్నాయి.




ఇక పాయకరావుపేటలో అనితకు గెలవడానికి మంచి ఛాన్స్ ఉంది. శృంగవరపుకోటలో కోళ్ళ లలిత కుమారి, నందిగామలో తంగిరాల సౌమ్య, ఆలూరులో కోట్ల సుజాతమ్మ లాంటి వారికి కూడా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక భూమా అఖిలప్రియ, గౌరు చరితా రెడ్డిలు ఇంకాస్త కష్టపడాలి.






Discussion about this post