Site icon Neti Telugu

వైసీపీ కాపు నేతల్లో టెన్షన్..ఒక్కరు గట్టెక్కలేరు.!

అధికార వైసీపీలో అలజడి మొదలైంది..ఎప్పుడైతే చంద్రబాబు-పవన్ కలిశారో అప్పటినుంచే జగన్‌కు టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. అందుకే పదే పదే టి‌డి‌పి-జనసేన పొత్తుని టార్గెట్ చేస్తున్నారు. అందరూ గుంపుగా వస్తున్నారని, తనకు ప్రజలు మద్ధతుగా ఉండాలని అడుగుతున్నారు. పోత్తు ఉంటే తమ గెలుపుకు ఇబ్బంది అని చెప్పి..ప్రజల్లో సెంటిమెంట్ లేపుతున్నారు. అటు కొందరు నేతల చేత బాబు, పవన్‌లని తిట్టించడం మరింత పెంచారు.

ముఖ్యంగా వైసీపీలో కాపు నేతలు పవన్‌ని విపరీతంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పవన్…టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పోత్తు ఖాయమని చెప్పడంతో వైసీపీ కాపు నేతలు మీడియా ముందుకు వచ్చి మాటల దాడి చేయడం మొదలుపెట్టారు. వారు మాటల దాడి చేయడానికి కారణం టి‌డి‌పి-జనసేన పోత్తు..ఆ పోత్తు ఉంటే తమకు నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. అందుకే ఏదొరకంగా తిట్టి బాబు-పవన్‌లని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. కానీ అదే వారికి రివర్స్ కానుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కాపు నేతలకు టి‌డి‌పి-జనసేన చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ సత్తా చాటింది. ముఖ్యంగా కాపు నేతలకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు పోత్తు ఉంటున్న నేపథ్యంలో వైసీపీ కాపు నేతలకు చెక్ పడిపోనుంది. అందులో మొదట మచిలీపట్నంలో పేర్ని నాని ఓటమి ఖాయమైంది. గత ఎన్నికల్లో పేర్ని..టి‌డి‌పిపై 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు జనసేనకు 18 వేల ఓట్లు వచ్చాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే పేర్ని అస్సామే.

ఇక నెక్స్ట్ పేర్ని పోటీ చేసిన, తన తనయుడు పోటీ చేసిన ఓటమి తప్పదు. అలాగే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉండే వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు టి‌డి‌పి-జనసేన చెక్ పెట్టనున్నాయి.

Exit mobile version