రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు కదులుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఉన్న స్తబ్దత దాదాపు తొలి గిపోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చేది ఎన్నికల నామ సంవత్సరమే. దీంతో ఇప్పు డు టీడీపీని టచ్ చేస్తే.. అధికార వైసీపీ నేతలకే నష్టం. వాస్తవానికి ఇప్పటి వరకు టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. వారిని అరెస్టు చేయించడం .. సహజంగా మారిపోయింది. దీంతో చాలా మంది టీడీపీ నాయకులు బయటకు వచ్చినా.. పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ మాత్రం చేయలేక పోయారు.

అయితే.. ఇప్పు డు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. వైసీపీ ఏమాత్రం దూకుడు రాజకీయాలు చేసినా.. ఆ పార్టీకే మైనస్ అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల దూకుడు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీడీపీ నాయకులు పుంజు కుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు దూకుడుగా చేస్తున్నారు. విశాఖ నుంచి అనంతపురంవరకు అన్ని ప్రాంతాల్లో నూ.. ప్రజల సమస్యలపై గళం వినిపిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్నిసైతం నిలదీస్తున్నా రు. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా నాయకులు స్తబ్దుగా ఉన్నారు. అయితే.. ఇటీవల కాలంలో చంద్రబాబు చేస్తున్న దిశానిర్దేశంతో పాటు రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలు కూడా పార్టీ నేతలకు కలిసి వస్తున్నాయి.

ముఖ్యంగా ప్రజల్లో వస్తున్న మార్పు వారికి కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీ నేతలు.. పుంజుకుంటున్నారు. కేడర్‌లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతు న్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. బలమైన వాయిస్ కూడా వినిపిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న ఫైర్‌బ్రాండ్ నాయకులు.. నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడుల మాదిరిగానే.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నాయకులు కకూడా పుంజుకున్నారు.

మహిళా నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వంగలపూడి అనిత, గౌతు శిరీష వంటివారు.. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. దీంతో పార్టీలో సరికొత్త మార్పు చోటు చేసుకుందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. దీంతో మరో రెండేళ్లపాటు.. ఇదే ఊపు కొనసాగిస్తే.. సైకిల్ పుంజుకుని.. అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post