అధికార వైసీపీ ప్రత్యర్ధులని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదేవిధంగా ముందుకెళుతూ ప్రత్యర్ధులని ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రత్యర్ధి పార్టీలు పాలసీ పరమైన విమర్శలు చేస్తే..వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగతంగా బూతులు తిడుతున్నారు. ఇక ఏ కులం నేతలని ఆ కులం వారితో తిట్టిస్తుంటారు. చంద్రబాబుని కొడాలి నానితో, పవన్ కల్యాణ్‌ని పేర్ని నానితో ఎక్కువ తిట్టిస్తారు.
అలా సొంత కులం వాళ్ళతోనే తిట్టించడం వైసీపీ రాజకీయం..ఇక అలా తిడుతున్న నేతలకు చెక్ పెట్టాలని టిడిపి, జనసేన శ్రేణులు కసితో రగిలిపోతున్నారు. గుడివాడలో కొడాలికి, బందరులో పేర్నికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి, జనసేన కలిస్తే..వారిద్దరికి రిస్క్ ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా బందరులో పేర్నికి రిస్క్ ఎక్కువ.

పేర్ని బందరులో మూడుసార్లు గెలిచారు. అందులో ఒకసారి వైఎస్సార్ వేవ్ లో, రెండుసార్లు ఓట్లు చీలడం వల్ల గెలిచారు. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల గెలవగా, 2019లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచారు. ఆ ఎన్నికల్లో పేర్ని..టిడిపిపై 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అంటే రెండు పార్టీలు కలిస్తే పేర్ని గెలిచే వారు కాదు.
ఈ సారి రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. దీంతో పేర్నికి రిస్క్ ఉంది. టిడిపికి సీటు దక్కే ఛాన్స్ ఉంది. జనసేన మద్ధతు ఇవ్వనుంది. అయితే ఈ సారి పేర్ని కాకుండా..తన వారసుడుని రంగంలోకి దింపుతున్నారు. దీంతో టిడిపి, జనసేన ప్రభావం పేర్ని వారసుడుని ఓటమి దిశగా తీసుకెళుతుందనే చెప్పాలి. మొత్తానికి పవన్‌ని తిట్టిన పేర్ని..తన తనయుడుకు మొదట ఓటమి చూపించేలా ఉన్నారు.