దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నెల్లూరు జిల్లాలో టిడిపి రేసులోకి వచ్చింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో జిల్లాలో టిడిపి సత్తా చాటింది. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నెల్లూరులో 11 సీట్లు ఉండేవి..అప్పుడు టిడిపి 7 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంది. ఇంకా అంతే ఆ తర్వాత నుంచి నెల్లూరులో టిడిపి సత్తా చాటలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచింది.
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. 2014లో 10 సీట్లకు వైసీపీ 7, టిడిపి 3 సీట్లు గెలుచుకుంది. 2019లో 10కి 10 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. నెల్లూరులో టిడిపి పట్టు సాధిస్తుంది..మళ్ళీ 1999 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. అదే సమయంలో వైసీపీలో ఉండే కీలక నేతలు టిడిపి వైపుకు వస్తున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. దీంతో నెల్లూరులో టిడిపికి ఆధిక్యం వచ్చేలా ఉంది.

ఇక టిడిపి హవా ఉండటంతో ఈ సారి నెల్లూరు లో సీట్ల కోసం పోటీ నెలకొంది. వైసీపీ నుంచి వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో సీట్లు ఫిక్స్ అయ్యేలా ఉన్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి..ఆత్మకూరులో పోటీ చేయవచ్చు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..నెల్లూరు రూరల్ బరిలో ఉంటారు. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి కాస్త డౌట్ అక్కడ టిడిపి నేత బొల్లినేని వెంకటరామరావు ఉన్నారు.
ఇక కావలిలో మాలెపాటి సుబ్బనాయుడు ఉన్నారు..కానీ ఆయనకు సీటు ఇంకా ఫిక్స్ కాలేదు.నెల్లూరు సిటీ మాజీ మంత్రి నారాయణ గాని, ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలో దిగవచ్చు. ఇటు కోవూరులో దినేష్ రెడ్డి పోటీ చేస్తారు. సర్వేపల్లిలో మళ్ళీ సోమిరెడ్డి బరిలో ఉంటారు. గూడూరులో పాశం సునిల్ కుమార్, వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ, సూళ్ళూరుపేటలో పరసా వెంకట రత్నం పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇలా దాదాపు నెల్లూరులో టిడిపి అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు.