గత ఎన్నికల తర్వాత నుంచి టీడీపీ నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు ఎన్నికల్లో బాగా నష్టపోయింది. దీంతో పార్టీని మళ్ళీ లైన్‌లో పెట్టడానికి చంద్రబాబు కష్టపడుతూనే ఉన్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై మొదట నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూనే వచ్చారు. ఆది నుంచి అనేక సమస్యలపై టీడీపీ శ్రేణులు పోరాటం చేశాయి.

అయితే మొదట్లో టీడీపీ నేతలు పెద్దగా పోరాటాలు చేయలేదనే చెప్పాలి. ఏదో కొద్ది మంది తప్ప మిగిలిన వారు పెద్దగా స్పందించేవారు కాదు. చంద్రబాబు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే టీడీపీ నేతలు పెద్దగా రెస్పాన్స్ అవ్వలేదు. జగన్ ప్రభుత్వం విషయ్మ్లో భయపడి చాలామంది వెనుకడుగు వేశారు. మళ్ళీ ఎక్కడ ఏ కేసులో ఇరికిస్తారని ఆలోచించేవారు. కానీ నిదానంగా చంద్రబాబు, టీడీపీ నేతలకు ధైర్యం చెబుతూ వచ్చారు. పైగా జైలుకు వెళ్లొచ్చిన నేతలకు ఇంకా కసి పెరిగింది. వారు ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో మిగిలిన టీడీపీ నేతలు కూడా బయటకు రావడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఈ మధ్య చంద్రబాబు టీడీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. సరిగ్గా పనిచేయని నాయకులని పక్కనబెట్టి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. అలాగే పలు నియోజక్వర్గాల్లో మార్పులు కూడా చేశారు. ఈ పరిస్తితుల నేపథ్యంలో టీడీపీ నేతలంతా యాక్టివ్ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఇంచార్జ్‌లు దూకుడుగా పనిచేయడం స్టార్ట్ చేశారు.

ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ధరలు దిగి రావాలి…జగన్ దిగిపోవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తమ్ముళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది..ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొత్తానికి రెండున్నర ఏళ్ల తర్వాత తమ్ముళ్ళు లైన్‌లో పడ్డారని చెప్పొచ్చు.

Discussion about this post