అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై గాని, మంత్రులపై గాని ప్రజా వ్యతిరేకత ఉన్న విషయంలో వాస్తవం ఉందని చెప్పవచ్చు..కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశంలో వైసీపీ అంతర్గత సర్వేలు కూడా క్లారిటీ ఇస్తున్నాయి. అలాగే గడపగడపకు వెళ్లని వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ ఇస్తున్నారు. పలు సర్వేల ఆధారంగా వారికి జగన్ క్లాస్ పీకుతున్నారు.

అయితే వారిలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. తాజాగా గడపగడపకు వెళ్ళడంలో పలువురు మంత్రులు బాగా వెనుకబడ్డారనిచెప్పి..వారి పేర్లని జగన్ స్వయంగా చదివి వినిపించారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, మేరుగ నాగార్జున, పినిపే విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, విడదల రజని, చెల్లుబోయిన, జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు.. అంటే దాదాపు అందరూ మంత్రులు గడపగడపకు తిరగడంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో వీరిలో కొందరికి తమ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకత కూడా వస్తుందని తేలింది. బొత్స, బుగ్గన, పెద్దిరెడ్డి లాంటి వారికి ఎలా ఉన్నా ఇబ్బందులు ఉండవు..మళ్ళీ వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.

కానీ మిగిలిన మంత్రుల పరిస్తితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వారికి మళ్ళీ గెలుపు అనేది డౌటే అని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తు గాని ఖాయమైతే మెజారిటీ మంత్రులు గెలుపు బాట పట్టడం డౌటే అని అంటున్నారు. జోగి రమేష్, విడదల రజిని, అప్పలరాజు, ధర్మాన, అమర్నాథ్, కారుమూరి, మేరుగు, విశ్వరూప్..ఇలా కొంతమంది మంత్రులకు గెలవడం కూడా కష్టమే అంటున్నారు. మొత్తానికైతే మన్తృలు చాలావరకు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది.
