ఉత్తరాంధ్ర మాదే..అమరావతి మాదే..రాయలసీమ మాదే..2024 మాదే..2029 మాదే..ఇది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు పెడుతున్న పోస్టులు..అంటే వచ్చే ఎన్నికలే కాదు..ఆ పై ఎన్నికలు కూడా గెలిచేస్తామనే ధీమాలో వైసీపీ ఉంది. ఇక మూడు ప్రాంతాల్లో తమని ఆపేది ఎవరు అని అంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీకి వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. కానీ అక్కడ తాజాగా ఇళ్ల పట్టాలు ఇస్తూ..జగన్ భారీ సభ పెట్టారు..దీంతో రాజధానికి దగ్గరలో ఉన్న జిల్లాల్లో తమదే పై చేయి అని వైసీపీ అంటుంది.

ఎలాగో ఉత్తరాంధ్ర, రాయలసీమలో తమకు తిరుగులేదని అంటున్నారు. అయితే ఇంత కాన్ఫిడెన్స్ గా టిడిపి శ్రేణులు చెప్పడం లేదు. వైసీపీ శ్రేణులు మాత్రం చెబుతున్నాయి. మరి ఇది వైసీపీ శ్రేణుల కాన్ఫిడెన్స్ అవుతుందా? ఓవర్ కాన్ఫిడెస్న్ అవుతుందా? అంటే రాజకీయాలు తెలిసిన ఎవరైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెబుతారు. అంటే అధికార బలం ఉండటం వల్ల ఇంకా తమదే పై చేయి అనే భ్రమలో వైసీపీ శ్రేణులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్తితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు వైసీపీ చెబుతున్నట్లుగానే ప్రాంతాల వారీగా పరిస్తితుల చూస్తే..ఉత్తరాంధ్రలో టిడిపి లీడ్ లోకి వచ్చింది. కోస్తాలో కాస్త పోటీ వాతావరణం ఉంది. అదే సమయంలో టిడిపి-జనసేన కలిస్తే కోస్తా లో వార్ వన్ సైడ్ అవుతుంది. ఇక సీమలో వైసీపీకి ఆధిక్యం ఉంది..కానీ గత ఎన్నికల్లో వన్ సైడ్ గా వచ్చిన ఆధిక్యం ఈ సారి రాదు. అక్కడ టిడిపి బలపడుతుంది. ఇంకా ఎన్నికల నాటికి ప్రజల మైండ్ మారితే సీమలో కూడా ఆధిక్యం మారిపోతుంది. కాబట్టి మూడు ప్రాంతాల్లో వైసీపీకి మైనస్సే.