రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…ఇంతకాలం అధికార వైసీపీ ఆధిక్యంలో ఉండగా, ఇప్పుడు అక్కడ టీడీపీ లీడ్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది…అదే సమయంలో తూర్పులో జనసేన కూడా పికప్ అయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో పూర్తిగా వైసీపీకే ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉంటే..వైసీపీ 14 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 4, జనసేన 1 సీటు గెలుచుకుంది.

అయితే ఇప్పుడు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..పలు నియోజకవర్గాల్లో వైసీపీపై నెగిటివ్ పెరుగుతుంది…వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఊహించని విధంగా వ్యతిరేకత పెరుగుతుంది…దాదాపు సగంపైనే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి…ఈ సారి ఎన్నికల్లో దాదాపు 10 మంది ఎమ్మెల్యేల గెలుపు కష్టమైపోతుందని తెలుస్తోంది…అదే సమయంలో టీడీపీ చాలా వరకు పుంజుకుందని తెలుస్తోంది….దాదాపు 10 సీట్లలో పార్టీకి లీడ్ కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి.

అదే సమయంలో జిల్లాలో జనసేన కూడా బాగానే పికప్ అయిందని తెలుస్తోంది…గత ఎన్నికల్లో జనసేన ఒక సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే…ఇక జనసేన తరుపున గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. అయినా సరే జిల్లాలో జనసేన బలం పెరిగింది తప్ప, తగ్గలేదు..దాదాపు 3-4 సీట్లలో జనసేనకు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన గాని కలిస్తే…వైసీపీకి చుక్కలు కనిపించే పరిస్తితి ఉంది.

ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే 5-6 సీట్లు అయిన గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది…అలా కాకుండా రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే…దాదాపు 15-16 సీట్లు వరకు గెలుచుకోవచ్చని తెలుస్తోంది…అంటే టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తేనే వైసీపీకి అడ్వాంటేజ్. మొత్తానికైతే తూర్పు లో లీడ్ మారుతుందని చెప్పొచ్చు.

Discussion about this post