రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిలో టిడిపి బలం పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో టిడిపికి పట్టు దొరికినట్లే కనిపిస్తుంది. ఇదే ఊపుతో ముందుకెళితే తూర్పులో సత్తా చాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో తూర్పులో టిడిపికి భారీ డ్యామేజ్ జరిగింది. మొత్తం 19 స్థానాలు ఉన్న జిల్లాలో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంటే, టిడిపి 4 సీట్లు గెలుచుకుంది. జనసేనకు ఒక సీటు దక్కింది.

అయితే ఈ సారి పరిస్తితి మారేలా ఉంది. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం జరిగింది. ఈ సారి ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో తూర్పులో వైసీపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య పొత్తు లేకుండా వైసీపీ-టీడీపీ బలబలాలపై సర్వే జరిగినట్లు తెలిసింది. ఆ సర్వే ప్రకారం కొన్ని స్థానాల్లో టిడిపి లీడ్ లోకి వచ్చింది. కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, పెద్దాపురం, ముమ్మిడివరం, ప్రత్తిపాడు సీట్లలో టీడీపీకి లీడ్ ఉంది.

అమలాపురం, అనపర్తి, పి.గన్నవరం, రాజానగరం, పిఠాపురం స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలిసింది. కాకినాడ రూరల్, కొత్తపేట, జగ్గంపేట సీట్లలో టీడీపీ-వైసీపీ పోటాపోటిగా ఉందని తేలింది. అటు రంపచోడవరం, తుని, రాజోలు, రామచంద్రాపురం స్థానాల్లో క్లారిటీ రాలేదు. అదే సమయంలో జనసేనకు ఎక్కడ బలం ఉందో చెప్పలేదు.

కానీ టిడిపి-జనసేన కలిస్తే మెజారిటీ సీట్లు దక్కడం ఖాయం. దాదాపు 14 స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే తుని, రంపచోడవరం, అనపర్తి లాంటి స్థానాల్లో వైసీపీ బలంగా కనిపిస్తుంది. మొత్తానికి తూర్పులో టీడీపీకి పట్టు పెరిగింది.
