టీడీపీలో జోష్ పెంచాలంటే.. అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జోష్ కావాలి.. జోష్ కావా లి.. అంటూనే నిర్ణయాలు నానుస్తే.. ఎలా జోష్ పెరుగుతుంది? అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే.. మరో ఏ డాదిన్నర సమయంలోనే ఎన్నికలకు నగారా మోగనుంది. వాస్తవానికి ఇప్పటికే ఏపీలో ఎన్నికల కోలాహ లం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో యువత పుంజుకోవాలని.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు.

అయితే, చాలా నియోజకవర్గాల్లో యువతకు సంబంధించి.. టీడీపీ అధినేత టికెట్లను కన్ఫర్మ్ చేయలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో.. పార్టీని వారుపట్టించుకోవాలా? వద్దా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతు న్నారు. ఉదాహరణకు గుంటూరులోని సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, విజయవాడ వెస్ట్, అనంతపురం ధర్మవరం, పెనుకొండ, అనంతపురం అర్బన్, పుట్టపర్తి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, కడపలోని రైల్వే కోడూరు.. విజయనగరం జిల్లా రాజాం, ఉమ్మడి ప్రకాశంలోని చీరాల, గిద్దలూరు..

ఇలా చెప్పుకొంటూ.. పోతే.. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జ్‌లు లేరు. ఉన్నా.. వీరికే టికెట్ అనే హా మీ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు వినిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న నాయకులు.. పైకి అడగ లేక, అలాగని.. పార్టీలో యాక్టివ్‌గానూ .. ఉండలేక సతమతం అవుతున్నారు. “ఇప్పటికిప్పుడు పార్టీలో యాక్టివ్‌గానే పనిచేయాలని ఉంది. దీనికి కొంత ఖర్చు కూడాపెట్టాలి. అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా.. పార్టీని నడిపించాలంటే.. భారీగానేఖర్చవుతుంది. ఇంత భరించిన తర్వాత.. టికెట్ విషయంపై లొల్లిపెడితే!“ అని ఒక యువనాయకుడు గుంటూరులో వ్యాఖ్యానించారు.

ఇదే తరహా రాజకీయ పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఏదో ఒకటి తేల్చేయాలని.. తమ్ముళ్లు కోరుతున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా.. యువతకు బూస్ట్ ఇచ్చేలా.. నియజకవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తే.. ఇక, పార్టీ నాయకులు పుంజుకుని.. ఎంత ఖర్చయినా చేసేందు కు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా.. అప్పటికప్పుడు ఎన్నికలకు ముందు టికెట్లు ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదని సలహాలు వస్తున్నాయి. మరి చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ముందుగానే ఈ ప్రకటన చేస్తారో లేదో చూడాలి.

Discussion about this post