సాధారణంగా ఏపీ రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లోనే ఉంటుంది…అలాగే నెల్లూరు, ప్రకాశం…కాస్త గుంటూరు జిల్లాపై కూడా ప్రభావం ఉంటుంది. ఇక మిగిలిన జిల్లాలో రెడ్డి సామాజికవర్గం హవా తక్కువ. కానీ వైసీపీ రెడ్డి వర్గం చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే…అందుకే కోస్తాలో కూడా కొందరు రెడ్లకు సీట్లు ఇచ్చిన పరిస్తితి ఉంది. ముఖ్యంగా కాపు, శెట్టిబలిజ, దళిత వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారంటే…వైసీపీ ఏ విధంగా రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాల్సిన పని లేదు.

కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు జగన్ గాలిలో గెలిచేశారు. అయితే 2014లో కూడా స్వల్ప మెజారిటీతో జగ్గిరెడ్డి…వైసీపీ నుంచి గెలిచారు. ఇలా తూర్పులో ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఏ వర్గ నేతలైన ప్రజలకు సేవ చేస్తే…మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి..మరి ఈ ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు పనిచేసి ప్రజలని మెప్పిస్తున్నారా? అంటే అబ్బే పెద్దగా లేదనే చెప్పొచ్చు.


ఎందుకంటే కాకినాడ సిటీ, కొత్తపేట నియోజకవర్గాల్లో కొత్తగా జరిగిన అభివృద్ధి పెద్దగా ఏమి లేదు. ఏదో మొక్కుబడిగా పథకాలు మాత్రం అందుతున్నాయి…అవి కూడా అందరికీ అందడం కష్టమే…మళ్ళీ పథకాల్లో కోతలు…దానికి తోడు ప్రజలపై పెరిగిన పన్నుల భారం. ఇక నియోజకవర్గాల్లో ఉండే సమస్యలని పరిష్కరించడంలో రెడ్డి ఎమ్మెల్యేలు సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. దీనికి తోడు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల అక్రమాలు కూడా ఎక్కువనే విమర్శలు…ఇసుక, మట్టి, ఇళ్ల స్థలాలు…ఇలా ప్రతిదానిలోనూ దోపిడి జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి.


మరి ఇంత జరుగుతుంటే రెడ్డి ఎమ్మెల్యేలకు పాజిటివ్ ఉండటం కష్టమే అని చెప్పొచ్చు. అసలు వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు గెలవడం అనేది చాలా కష్టమని ఇప్పటినుంచే కథనాలు వస్తున్నాయి. మొత్తానికైతే ఈ సారి ఇద్దరు రెడ్లని ఓటమి పలకరించేలా ఉంది.


Discussion about this post