అధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిలో ఈ సారి రాజకీయాలు ఆసక్తికరంగా మారేలా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ-టిడిపిల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగేలా ఉంది. కాకపోతే ప్రస్తుతానికి తిరుపతిలో వైసీపీకే లీడ్ కనిపిస్తుంది. అంటే టిడిపి సరిగ్గా లేకపోవడమే వైసీపీకి ప్లస్. అయితే మొదట నుంచి ఇక్కడ టిడిపి-కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతూ గెలుస్తూ వచ్చాయి.

ఇక ఇక్కడ 1983లో ఎన్టీఆర్ గెలవగా, 2009లో చిరంజీవి గెలిచారు. ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి తిరుపతిలో గెలిచారు. కానీ తర్వాత జరిగిన ఉపఎన్నికలో వైసీపీ గెలిచింది. 2014లో మాత్రం టిడిపి గెలిచింది. టిడిపి నుంచి గెలిచిన వెంకటరమణ చనిపోవడంతో. ఉపఎన్నిక రాగా, ఆ ఉపఎన్నికలో రమణ భార్య సుగుణమ్మ గెలిచారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, టిడిపి నుంచి సుగుణమ్మ పోటీ చేశారు. ఈ పోరులో కేవలం 708 ఓట్ల తేడాతో భూమన గెలిచారు. భూమన గెలిచాక తిరుపతిలో దూసుకెళుతున్నారు. ఓ వైపు తాను, మరోవైపు తన తనయుడు తిరుపతిపై పట్టు సాధించారు.
అయితే వైసీపీలో అక్రమాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఉంది. కానీ ఇక్కడ టిడిపి నాయకురాలు సుగుణమ్మ దూకుడుగా పనిచేయడం లేదు. దీని వల్ల టిడిపికి నెగిటివ్ కనిపిస్తుంది. అందుకే లేటెస్ట్ సర్వేల్లో కూడా ఇక్కడ వైసీపీకే లీడ్ కనిపించింది. దీంతో తిరుపతి టిడిపి సీటు మార్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.
అదే సమయంలో జనసేనతో గాని పొత్తు ఉంటే..తిరుపతి సీటు ఆ పార్టీకే ఇస్తారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు 12 వేల ఓట్లు పడ్డాయి. అంటే అప్పుడు టిడిపి-జనసేన కలిసి ఉంటే వైసీపీ గెలిచేది కాదు. ఈ సారి గాని కలిసి బరిలో ఉంటే తిరుపతిలో వైసీపీకి చెక్ పడుతుంది.
