తెలుగుదేశం పార్టీకి మొదట నుంచి అనుకూలంగా లేని పార్లమెంట్ స్థానాల్లో తిరుపతి ఒకటి. అసలు పార్టీ ఆవిర్భవించక…టిడిపి ఒక్కసారి మాత్రమే తిరుపతిలో గెలిచింది. 1984లో గెలవగా, 1999 ఎన్నికల్లో టిడిపి పొత్తుతో బిజేపి గెలిచింది. ఇంకా అంతే మరొకసారి తిరుపతిలో టిడిపి జెండా ఎగరలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఆ మధ్య జరిగిన ఉపఎన్నికలో కూడా వైసీపీనే గెలిచింది. భవిష్యత్‌లో కూడా తిరుపతిలో టిడిపి గెలిచేలా కనిపించడం లేదు.

ఇక ఉపఎన్నికలో ఓడిపోయిన పనబాక లక్ష్మీ అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆమె టిడిపిలో కనిపించేలా లేరు. అయితే తిరుపతి పార్లమెంట్ స్థానంలోనే కాదు….పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా టిడిపి లైన్ అయ్యేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది.

అయితే ఇప్పటికీ ఏడు నియోజకవర్గాల్లో టిడిపి లైన్ అవ్వలేదు…కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా సరే, దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టిడిపి ఉంది. సర్వేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అక్కడ టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ట్రాంగ్ అవ్వడానికి కష్టపడుతున్నారు.

అటు శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి తిరుగులేదన్నట్లే పరిస్తితి ఉంది. ఇక్కడ టిడిపి తరుపున బొజ్జల సుధీర్ పనిచేస్తున్నారు. ఇటు తిరుపతి అసెంబ్లీలో భూమన కరుణాకర్ రెడ్డి సైతం బాగానే పనిచేస్తున్నారు….ఇక్కడ టిడిపి నాయకురాలు సుగుణమ్మ పెద్దగా యాక్టివ్ గా లేరు. గూడూరులో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

అయినా సరే అక్కడ టిడిపి బలపడలేకపోతుంది. వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ టిడిపి పరిస్తితి అంతంత మాత్రమే. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్తితి.

Discussion about this post