ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని ప్రాంతాల్లో తిరుపతి పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టిడిపి గెలుపు అరుదు అని చెప్పవచ్చు. ఎప్పుడో 1984లో ఒకసారి అక్కడ టిడిపి గెలిచింది. మధ్యలో టిడిపి పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో బిజేపి గెలిచింది. అంతే ఇంకా అక్కడ ఇంతవరకు టిడిపి గెలవలేదు. అంటే తిరుపతిలో టిడిపికి బలం లేదనే చెప్పవచ్చు. 1984 నుంచి మళ్ళీ అక్కడ టిడిపి జెండా ఎగరలేదు.

ఇకా గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అలాగే ఆ మధ్య ఉపఎన్నికలో కూడా వైసీపీ గెలిచింది. ఇలా తిరుపతి పార్లమెంట్ పై వైసీపీకి గట్టి పట్టు ఉంది. అయితే ఇప్పుడు నిదానంగా గాలి మారుతుంది..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..ఈ నేపథ్యంలో తిరుపతిని దక్కించుకోవాలని చూస్తుంది. కానీ తిరుపతి దక్కడం అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా అక్కడ కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు దొరకలేదు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి..సర్వేపల్లి, గూడూరు , సూళ్ళూరుపేట, వెంకటగిరి,తిరుపతి, శ్రీకాళహస్తి సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్నీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు నిదానంగా కొన్ని సీట్లలో టిడిపి బలపడుతుంది. ఒకవేళ ఆనం రామ్ నారాయణ రెడ్డి టిడిపిలోకి వస్తే వెంకటగిరిపై పట్టు దొరుకుతుంది. అటు సర్వేపల్లిలో ఇప్పుడుప్పుడే లీడ్ వస్తుందని తెలుస్తోంది. గూడూరులో వైసీపీపై నెగిటివ్ ఉంది. సూళ్ళూరుపేట వైసీపీ లీడ్ ఉంది. తిరుపతి, కాళహస్తిల్లో కూడా వైసీపీ లీడ్ ఉంది. కానీ ఎన్నికల నాటికి సీన్ మారవచ్చు. ఒకవేళ టిడిపి లీడ్ లోకి వస్తే తిరుపతి ఎంపీ సీటుని గెలవచ్చు..లేదంటే అంతే సంగతులు.
