ఏపీలో అధికార వైసీపీలో సొంత పోరు ఎక్కువ అవుతుంది..ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీటు కోసం రచ్చ జరుగుతుంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి పార్టీని నాశనం చేస్తున్నారని, అలాంటి వారికి సీటు ఇస్తే తామే ఓడిస్తామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని తాడికొండలో అదే పరిస్తితి. ఇటు కృష్ణా జిల్లాలోని తిరువూరులో అదే పరిస్తితి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న తిరువూరులో వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే రక్షణనిధి, ఎమ్మెల్యే బామ్మర్ది, అనుచరులు పెద్ద ఎత్తున తిరువూరులో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇసుకలో దోపిడి, భూ కబ్జాలు చేస్తున్నారని, ఎలాంటి పోస్టులకైనా డబ్బులు తీసుకోవడం కామన్ అయిందని వైసీపీలోని మరో వర్గం ఆరోపిస్తుంది. ఈ సారి ఎమ్మెల్యేకు మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. ఈ పరిస్తితులని చక్కదిద్దాలని వైసీపీ అధిష్టానం చూసింది గాని..అది అంతగా వర్కౌట్ కాలేదు.

అసమ్మతి వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామాల వారీగా మీటింగులు పెట్టి ముందుకెళుతున్నారు. ఈ పరిణామాలు తిరువూరు వైసీపీకి డ్యామేజ్ అని చెప్పవచ్చు. ఈ పరిస్తితులని టీడీపీ యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది..కాకపోతే టీడీపీలో కూడా వర్గ పోరు ఉంది. ఇంచార్జ్ దేవదత్, టీడీపీ నేత వాసం మునయ్య వర్గాలకు పడటం లేదు. ఈ ఇద్దరు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు.అలా కాకుండా కలిసి పనిచేసి..వైసీపీలోని అసమ్మతిని క్యాష్ చేసుకుంటే 1999 తర్వాత..2024లో తిరువూరులో టీడీపీ జెండా ఎగిరే ఛాన్స్ ఉంటుంది.
