రాజకీయాల్లో సొంత అవసరాలే తప్ప…ప్రజా అవసరాలు పెద్దగా పట్టించుకోని నాయకులు చాలామందే ఉన్నారు…పైకి ఏదో ప్రజల కోసం పనిచేస్తున్నామని చెబుతున్నా సరే…చాలామంది సొంత ప్రయోజనాలని చూసుకోవడం కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటారు…సొంత ప్రయోజనాలు కోసం పార్టీలు కూడా మార్చేస్తుంటారు…పేరుకు ఏదో ప్రజల కోసం పార్టీ మారుతున్నామని చెబుతారు గాని…ఆశలు నిజం మాత్రం తమ పదవుల కోసం పార్టీలు మారుతారు…మరి ఇప్పటికే చాలామంది నాయకులు మారిపోయారు.

మరి అదే క్రమంలో ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న తోట త్రిమూర్తులు కూడా టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు…మరి ఈయన సొంత ప్రజల కోసం వెళ్లారో లేక సొంత ప్రయోజనాల కోసం వెళ్లారో తెలియదు గాని…పార్టీ మారక మాత్రం పదవులు మాత్రం వచ్చాయి…ఎన్నో ఏళ్లుగా వైసీపీలో పనిచేస్తున్న వారికి పదవులు రాకపోయినా సరే తోటకు మాత్రం ఎమ్మెల్సీ పదవి దక్కింది…అలాగే మండపేట ఇంచార్జ్ గా కూడా పనిచేస్తున్నారు.

ఇక తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురం వదిలిపెట్టి…తోట మండపేటలో వైసీపీని పైకి లేపడానికి చూస్తున్నారు…అలాగే అధికారం అండతో స్థానిక ఎన్నికల్లో మండపేటలో మంచి విజయాలే అందుకున్నారు. మరి విజయాల తర్వాతే తోటకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది…ఇక అక్కడ నుంచి తనకు తిరుగులేదనే విధంగా తోట దూసుకెళుతున్నారు.

మిగిలిన వైసీపీ నేతల మాదిరిగా ఈయన కూడా నోటికి పనిచెప్పడం మొదలుపెట్టారు. తాజాగా మండపేట టీడీపీ ఎమ్మెల్యే ని ఉద్దేశించి గాడిద అని కూడా తిట్టేశారు..అంటే అధికారం ఉంటే ఏదైనా మాట్లాడటానికి వైసీపీ నేతలకు లైసెన్స్ దొరికినట్లు కనిపిస్తోంది…ఇక ఈ విధంగా అధికార దర్పాన్ని ప్రద్రర్శించే వారిని ప్రజలు ఆదరిస్తారో లేదో చెప్పలేం.

అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని చూసుకుంటే మండపేటలో తోటకు క్షేత్ర స్థాయిలో అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు…అధికారం ఉన్నా లేకపోయినా…సౌమ్యంగా ఉంటూ…ప్రజల కోసం పనిచేసే వేగుళ్ళకు మాత్రం ప్రజల్లో ఆదరణ తగ్గినట్లు కనిపించడం లేదు. మొత్తానికైతే మండపేటలో తోటకు వేగుళ్ళ ఛాన్స్ ఇచ్చేలా లేరు.

Discussion about this post