ఏపీలోని ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతుంది..గత రెండు ఎన్నికల్లోనూ ఏజెన్సీ స్థానాల్లో వైసీపీనే సత్తా చాటుతూ వస్తుంది. ఎస్టీ రిజర్వడ్ గా ఉన్నా స్థానాల్లో టిడిపికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏపీలో ఎస్టీ స్థానాలు వచ్చి పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం, పోలవరం. 2014 ఎన్నికల్లో ఒక్క పోలవరంలోనే టిడిపి గెలిచింది. మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలిచింది.
2019 ఎన్నికల్లో 7 స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి..వైసీపీ బలం తగ్గుతూ..టిడిపి బలం పెరుగుతుంది..అయినా సరే ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా తగ్గడం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన సర్వేల్లో సైతం ఒక్క పోలవరంలోనే టిడిపి గెలుస్తుందని, మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని స్పష్టమైంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉండటానికి కారణాలు ఉన్నాయి. మొదట నుంచి ఆ ప్రాంతాల ప్రజలు వైఎస్సార్ పై అభిమానంతో ఉన్నారు. అప్పటిలో చంద్రబాబు…గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోలేకపోయారు.

ఇక వైఎస్సార్ పై ఉన్న అభిమానమే జగన్ పై కంటిన్యూ అవుతుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పెద్దగా లేదు..కానీ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో అక్కడి ప్రజలు సంతృప్తి చెందుతున్నారు. పథకాల ప్రభావం ఎక్కువ ఉండటంతో ఏజెన్సీల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది.
అయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న సరే టిడిపి నాయకత్వం బలంగా లేదు..అందుకే ఏజెన్సీల్లో ఇప్పటికీ వైసీపీ హవా నాదుస్తోంది.