April 2, 2023
ap news latest AP Politics TDP latest News

విశాఖ సిటీలో టీడీపీకి ట్రబుల్..సేవ్ చేసేది ఎవరు?

విశాఖ సిటీ అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట..గత రెండు ఎన్నికల్లో సిటీలోని నాలుగు స్థానాల్లో టి‌డి‌పి సత్తా చాటుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్ సీట్లలో టి‌డి‌పి గెలవగా, టి‌డి‌పి పొత్తులో భాగంగా విశాఖ నార్త్ లో బి‌జే‌పి గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో విశాఖలోని మిగతా అన్నీ స్థానాల్లో టి‌డి‌పి ఓడిపోయింది గాని..సిటీలోని నాలుగు స్థానాల్లో టి‌డి‌పి జెండా ఎగిరింది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో టి‌డి‌పిని దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చింది..విశాఖ రాజధాని కాన్సెప్ట్ తెచ్చింది..అయినా సరే ప్రజలు వైసీపీని నమ్మట్లేదు. ఇదే క్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి తీసుకున్నారు. దీంతో అక్కడ టి‌డి‌పికి దెబ్బతగిలింది. ఇటు విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు అసలు రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఇప్పుడు యాక్టివ్ అయ్యారు..కానీ అప్పటికే నార్త్ లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. గంటా పార్టీలో పనిచేయకపోవడం, నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం..అదే సమయంలో వైసీపీ ఇంచార్జ్ కే‌కే రాజు అందుబాటులో ఉండటంతో సీన్ మారింది.

అక్కడ వైసీపీ బలం పెరిగింది. తాజా సర్వేలో కూడా విశాఖ ఈస్ట్, వెస్ట్ ల్లో మళ్ళీ టి‌డి‌పికి గెలిచే అవకాశాలు ఉన్నాయని, నార్త్, సౌత్ ల్లో మాత్రం వైసీపీ గెలుస్తుందని తేలింది. అయితే ఈస్ట్, వెస్ట్ టి‌డి‌పి ఎమ్మెల్యేలని సైతం వైసీపీ గట్టిగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది..అయినా సరే వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆ రెండు చోట్ల టి‌డి‌పి బలం తగ్గలేదు.

అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి..ఈ లోపు నార్త్, సౌత్ ల్లో బలపడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో జనసేనతో గాని పొత్తు ఉంటే రెండు సీట్లలో వైసీపీకి చిక్కులు తప్పవు.