అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా కొవిడ్ బారినపడడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకులకు గురైంది. ఆసియా మార్కెట్లు, చమురు ధరలు, ఈక్విటీ ఫ్యూచర్లు కుప్పకూలాయి.
జపాన్‌కు చెందిన నిక్కీ 225 0.67 శాతం క్షీణించి 23,029.90 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 3.5 శాతానికిపైగా క్షీణించాయి. డౌ జోనెస్ ఫ్యూచర్స్ 1.40 శాతంతో 27,301 పాయింట్ల వద్ద ట్రేడ్ కాగా, నస్దాక్ 100 ప్యూచర్స్ మార్కెట్ 2.17 శాతం క్షీణించి 11,323 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ ఇండెక్స్ 1.57 శాతం క్షీణించి 3,314.75 వద్ద ట్రేడ్ అయింది.
ఆస్ట్రేలియన్ మార్కెట్ 1.42 శాతం క్షీణించి 5,983.20 వద్ద ముగియగా, షాంఘై ఎస్‌ఈ కాంపోజెట్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ స్వల్పంగా 0.20 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ 0.79 శాతం బలపడి 23,459.05 వద్ద ముగిసింది.
అలాగే, యూరోపియన్ స్టాక్స్, లండన్ ఎఫ్‌టీఎస్ఈ 100, జెర్మనీకి చెందిన డీఏఎక్స్ ఇండెక్స్, స్విస్ మార్కెట్ ఇండెక్స్‌లు కూడా క్షీణించాయి. అలాగే, యూఎస్ క్రూడ్ ఫీచర్లు 4.3 శాతం తగ్గి బ్యారెల్‌కు 37.6 డాలర్లకు పడిపోయింది. వరల్డ్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ 4.2 శాతం క్షీణించి బ్యారెల్‌కు 39.20 డాలర్లను తాకింది. కాగా, ట్రంప్ కరోనా బారినపడి క్వారంటైన్‌కు వెళ్లడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పట్టాలు తప్పే అవకాశం ఉంది.