రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీ హవా ఉంటుందో…ఆ పార్టీకి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ జిల్లాలో లీడ్‌లో ఉన్న పార్టీ..రాష్ట్రంలో కూడా లీడ్‌లోకి వస్తుంది. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే..రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమే. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా సరే…తూర్పుపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకోవడానికి చూస్తాయి.

అయితే గత ఎన్నికల్లో తూర్పులో వైసీపీ లీడ్ తెచ్చుకుంది. జిల్లాలో 19 సీట్లు ఉంటే వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 4, జనసేన ఒక సీటు గెలుచుకుంది. ఇక ఇప్పటికీ జిల్లాలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా జిల్లాలో సత్తా చాటాలని వైసీపీ చూస్తుంది. కానీ ప్రతిపక్ష టీడీపీ అనుకున్న స్థాయిలో మాత్రం జిల్లాపై పట్టు తెచ్చుకుంటున్నట్లు కనిపించడం లేదు.

పలు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు ఇంకా సెట్ కాలేదు. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అవుతున్నా సరే తూర్పులో చాలా చోట్ల టీడీపీ పికప్ అవ్వని పరిస్తితి. అసలు పలు నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే, దాన్ని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ ఉంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి అలాగే ఉంది. టీడీపీకి ఉన్న నాలుగు సిట్టింగ్ సీట్లని పక్కనబెడితే…మిగిలిన సీట్లలో కొన్ని చోట్ల తమ్ముళ్ళు సెట్ అవ్వలేదు. కాకినాడ లాంటి స్ట్రాంగ్ ప్రాంతంలో కూడా టీడీపీ చేతులెత్తేసే పరిస్తితి ఉంది.

అలాగే రామచంద్రాపురం, రాజానగరం, తుని, అమలాపురం, రాజోలు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు. అయితే కొన్ని చోట్ల జనసేన పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాజోలులో ఎలాగో ఆ పార్టీకి బలం ఉంది. అలాగే అమలాపురం, ముమ్మిడివరం లాంటి నియోజకవర్గాల్లో బలంగా కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి తూర్పులో తమ్ముళ్ళు బలపడకపోతే పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయం.

Discussion about this post