ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలో మళ్ళీ సత్తా చాటాలని జగన్ ప్లాన్ చేశారు. మొత్తం 19 సీట్లు ఉన్న ఈ జిల్లాలో..గత ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉంది..కానీ ఇక్కడ జనసేన ఓట్లు ఎక్కువ చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది..అలాగే వైసీపీకి లాభం జరిగింది. దాదాపు 10 సీట్లలో జనసేన ప్రభావం చూపింది.

అందుకే ఈ సారి ఆ నష్టం జరగకుండా టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ నేతలు అటు పవన్, ఇటు చంద్రబాబుని పరోక్షంగా రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టి..పొత్తు లేకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వైసీపీ ఎంత రాజకీయం చేసిన బాబు-పవన్ వారి రాజకీయం వారు చేస్తున్నారు. ఇదే సమయంలో తూర్పులో పార్టీ బలం తగ్గకుండా చేయాలని జగన్ చూస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా రాజమండ్రిలో భారీ సభ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. పెన్షన్ పెంపుకు సంబంధించి సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ స్థాయిలో జనాలని తరలించే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. దీని ద్వారా తూర్పులో వైసీపీ బలం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలని చూస్తున్నారు. అయితే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా..టీడీపీ-జనసేన గాని కలిస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదు. జిల్లాలో 15 సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ పొత్తు లేకపోతేనే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ పొత్తు తప్పనిసరిగా ఉండేలా ఉంది.
