ఏలూరు రాజకీయాల్లో ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) గురించి పెద్దగా పరిచయం అక్కరలేదనే చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి ఏలూరులో రాజకీయం చేస్తున్న ఆళ్ళ నాని..దివంగత వైఎస్సార్‌కు విధేయుడు..వైఎస్సార్ ఆధ్వర్యంలో ఏలూరు సీటు దక్కించుకున్నారు. 2004లో ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో కూడా ఆళ్ళ నాని సత్తా చాటారు.

ఇక తర్వాత వైఎస్సార్ మరణించడంతో..2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవిపై వేటు పడిన సరే ఆళ్ళ నాని..జగన్ తోనే ఉన్నారు. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏలూరులో పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 24 వేల ఓట్ల మెజారిటీతో నాని ఓడిపోయారు. అయినా సరే జగన్‌ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచారు. అప్పుడు జనసేనకు 16 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే జనసేయ ఓట్లు చీల్చడం ఆళ్ళ నానికి ప్లస్ అయింది.

ఇక జగన్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల మంత్రి పదవి దక్కింది. మంత్రిగా మంచి పనితీరుయ్ కనబర్చలేదు. దీంతో పదవి నుంచి తప్పించారు. అయినా జగన్..ఆళ్ళ నానికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ అనుకున్న విధంగా ఏలూరులో రాణించడం లేదు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఏలూరు బరిలో నిలబడితే ఆళ్ళ నాని గెలుపు సాధ్యం కాదని ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఆళ్ళ నానిని ఏలూరు ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం మొదలైంది. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ నూజివీడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఆళ్ళ నాని సీటు మారుతుందో లేదో.

Leave feedback about this