గత ఎన్నికల్లో జనసేనకు బాగా ఓట్లు వచ్చి రెండో స్థానం వచ్చిన సీట్లలో నరసాపురం ఒకటి..గాజువాక, భీమవరంలతో పాటు రెండోస్థానం వచ్చిన సీటు ఇదే. ఊహించని విధంగా ఇక్కడ జనసేనకు ఓటు పడ్డాయి. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండటంతో ఇక్కడ జనసేన భారీగా ఓట్లు తెచ్చుకుంది. గతంలో ఇది టిడిపి కంచుకోటగా ఉండేది. మెజారిటీ సార్లు టిడిపి గెలిచింది. కానీ జనసేన రావడంతో..టిడిపికి మద్ధతు ఇచ్చే కాపు ఓటర్లు అటు వైపు వెళ్లారు.
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ముదునూరు ప్రసాద్ రాజు గెలిచారు. ఆయనకు దాదాపు 55 వేల ఓట్లు వచ్చాయి. అటు జనసేన నుంచి పోటీ చేసి బొమ్మిడి నాయకర్ 49 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇటు టిడిపి నుంచి బండారు మాధవ నాయుడు పోటీ చేసి 27 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ టిడిపి కంటే జనసేనకే బలం ఎక్కువ ఉంది. కాకపోతే ఓట్లు చీలిక వల్ల వైసీపీ గెలిచింది. ఈ సారి టిడిపి, జనసేనల మధ్య పొత్తు ఫిక్స్ అవుతుంది.
పొత్తు ఉంటే ఖచ్చితంగా ఈ సీటు జనసేనకే దక్కుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే గెలుపు కూడా దాదాపు ఖాయమే. ఒకవేళ పొత్తు లేకపోయిన వైసీపీకి జనసేన గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో జనసేనకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే నరసాపురం జనసేన సీటు కోసం బాగా డిమాండ్ ఉంది. ఈ సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొమ్మిడి నాయకర్ మళ్ళీ పోటీ చేయాలని చూస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో జనసేనకు కాపు ఓట్లతో పాటు..నాయకర్ మత్స్యకార వర్గం కావడంతో ఆ ఓట్లు కలిసొచ్చాయి. ఆ కాంబినేషన్ తో విజయం సాధించవచ్చు. కాకపోతే ఈ సీటు కోసం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా ట్రై చేస్తున్నారు. గతంలో ఈయన నరసాపురం నుంచి టిడిపి తరుపున నాలుగుసార్లు గెలిచారు..తర్వాత ప్రజారాజ్యంలోకి, కాంగ్రెస్ లోకి, వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ టిడిపిలోకి వచ్చి..తర్వాత వైసీపీలోకి వెళ్ళి..ఇప్పుడు జనసేన వైపుకు వచ్చారు. ఇప్పుడు ఆయన సీటు కోసం ట్రై చేస్తున్నారు. దీంతో నరసాపురం సీటు ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు. పవన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో.