గోరంట్ల బుచ్చయ్య చౌదరీ…తెలుగుదేశం పార్టీలో మొదట నుంచి పనిచేస్తున్న సీనియర్ నేత. ఆరుసార్లు విజయాలు అందుకున్న నాయకుడు. అలాంటి నేతకు నెక్స్ట్ సీటు డౌట్ అంటే నమ్మడం కష్టమే. మళ్ళీ ఆయన పోటీ చేయడం ఖాయమని తెలుస్తుంది. మొదట్లో రాజమండ్రి సిటీ నుంచి నాలుగుసార్లు, తర్వాత రూరల్ నుంచి రెండుసార్లు గెలిచిన బుచ్చయ్య మళ్ళీ రూరల్ లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
కాకపోతే ఆ మధ్య తాను పోటీ చేయకుండా యువ నాయకులకు ఛాన్స్ ఇస్తానని అన్నారు. కానీ ఈ సారి టిడిపికి గెలుపు ముఖ్యం కాబట్టి బుచ్చయ్య డైరక్ట్ రంగంలోకి దిగుతున్నారు. మళ్ళీ రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేయనున్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చింది. జనసేనతో పొత్తు ఉండటం వల్ల ఆ సీటు..జనసేనకు దక్కుతుందనే ప్రచారం వస్తుంది. రూరల్ లో జనసేనకు పట్టు ఉంది. గత ఎన్నికల్లో 40 వేలు పైనే ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఇంకా బలం పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.

అదే సమయంలో ఆ సీటు టిడిపి సిట్టింగ్ సీటు..గత ఎన్నికల్లో బుచ్చయ్య గెలిచారు. ఇప్పటికే చంద్రబాబు..సిట్టింగులకు సీటు అని చెప్పేశారు. కాబట్టి ఆ సీటుని వదులుకోవడం కష్టం. పైగా బుచ్చయ్య లాంటి సీనియర్లని పక్కన పెట్టడం కుదిరే పని కాదు. ఒకవేళ జనసేనకు వేరే సీటు అడ్జస్ట్మెంట్ చేస్తారేమో గాని..రూరల్ సీటు ఇవ్వడం కష్టమే.
ఇక టిడిపి-జనసేన పొత్తు వల్ల మరొకసారి రూరల్ లో వైసీపీకి ఓటమి తప్పదని చెప్పవచ్చు. ఈ సారి కూడా బుచ్చయ్యకు ఎదురులేదనే చెప్పాలి.