ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక విషయం ప్రకంపనలు రేపుతుంది. అధికార పార్టీలో ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ అధినేత తీరుతో రగిలిపోతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తమ నియోజకవర్గ ప్రజలు అడుగుతున్న చిన్న చిన్న పనులు కూడా చేయలేని దుస్థితిలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చెబుదాం ? అనుకుంటుంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు.

మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దిక్కులేదు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాము ఎమ్మెల్యేలుగా గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు పార్టీలోనూ ఎలాంటి గుర్తింపు లేదు. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో నుంచి బయటకి వచ్చేస్తారని.. గత నాలుగైదు నెలలుగా ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ లిస్టులో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన మానుగుంట మహీధధర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది పేర్లు మాత్రం బయటకు రాక పోయినా… అధికార పార్టీ వర్గాల్లోనే ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే లో కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మహీధర్ రెడ్డితో పాటు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ – దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.


వీరు ఏ క్షణం ఆయన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి పార్టీ మారిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను సైతం నమ్మలేమని వైసిపి వాళ్ళు చెబుతున్నారు. ఆయన కూడా ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న వార్తలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.



Discussion about this post