ఇటీవల ఏపీ రాజకీయాల్లో కాస్త ఎక్కువ వినిపిస్తున్న పేరు ఉదయగిరి నియోజకవర్గం. ఈ మధ్య కాలంలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకోవడంతో ఉదయగిరి పేరు బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నలుగురు అనుమానితులుగా వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అందులో వైఎస్ ఫ్యామిలీకి వీరవిధేయుడు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. 2004 నుంచి ఉదయగిరిలో మేకపాటి సత్తా చాటుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక వైఎస్సార్ మరణం, జగన్ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ మేకపాటి వైసీపీలోకి వచ్చారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన..మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలిచారు.

అలా వైసీపీలో వీర విధేయుడుగా ఉన్న ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో మేకపాటి సైతం వైసీపీ నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరలేదు. కానీ నెక్స్ట్ ఆయన టిడిపిలో చేరతారనే ప్రచారం కూడా ఉంది. కాకపోతే ఇప్పటికే ఉదయగిరిలో టిడిపి సీటు కోసం పోటీ ఎక్కువ ఉంది. ఇటు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మళ్ళీ పోటీ చేయాలని చూస్తుండగా, అటు ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్ సైతం సీటు ఆశితున్నారు. ఈ ఇద్దరు పోటాపోటిగా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మేకపాటి సైతం ఇప్పుడు టిడిపిలో చేరితే..ఉదయగిరి సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు సర్వే చేయించి గెలిచే అభ్యర్ధికే సీటు ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఉదయగిరి సీటు ఎవరికి దక్కుతుందో.