ఏపీలో ఏది కొత్తగా జరగాలన్న ఉగాదికే ముహూర్తం పెట్టుకున్నట్లు ఉంది వైసీపీ ప్రభుత్వం…ప్రతి అంశాన్ని ఉగాదితోనే ముడి పెడుతున్నారు…ఇటీవల జిల్లాల విభజన అంశంపై నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే..ఆ నోటిఫికేషన్ అమలు ఉగాదికే జరుగుతుందని వైసీపీ చెబుతుంది. అలాగే ఉగాది నుంచి విశాఖపట్నం నుంచి పాలన నడుస్తుందని, అంటే ఉగాదికి కొత్త రాజధాని వస్తుందని చెబుతున్నారు. ఇటు కొత్త క్యాబినెట్ కూడా ఉగాదికే వస్తుందన్నట్లు చెబుతున్నారు. అంటే అన్నీ ఉగాదికే కొత్తగా జరగనున్నాయని తెలుస్తోంది.

అయితే ఇక్కడ ఒక అంశంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు గాని…మిగిలిన రెండు అంశాల్లో ట్విస్ట్‌లు ఉండొచ్చు. మంత్రివర్గంలో మార్పులు చేసే అంశం కేవలం జగన్ చేతుల్లోనే ఉంది..ఇది ఎవరూ ఆపలేరు…కాబట్టి ఇది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. అలాగే జిల్లాల విభజన అంశం కూడా జగన్ చేతుల్లోనే ఉంది..కాకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిల్లాల విభజనకు ఎలా ఆమోద ముద్ర వేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఎందుకంటే ఇప్పటికే జిల్లాల విభజనపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి..విభజనపై ప్రజలు సంతృప్తిగా లేరు. అలాంటప్పుడు ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా జగన్ మళ్ళీ జిల్లాల అంశాన్ని సరిచేసి ఆమోదిస్తారా? లేక గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోతారా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చేసుకుంటూ వెళితే ఇబ్బందులు తప్పవు.

ఇక రాజధాని అంశంలో ఇబ్బందులు తప్పేలా లేవు…తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ఉగాదికి విశాఖ నుంచి పాలన జరుగుతుందని చెప్పుకొచ్చారు. అంటే రాజధాని విశాఖకు షిఫ్ట్ అవుతుందని అర్ధమైపోతుంది. అలాగే మూడు రాజధానుల బిల్లుని మళ్ళీ తీసుకొచ్చి, ఆమోదించుకుని ముందుకెళ్లాలని జగన్ ప్రభుత్వం చూస్తుంది. కాకపోతే రాజధాని అంశంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి…కోర్టులో కేసులు ఉన్నాయి. సులువుగా అమరావతి నుంచి రాజధాని కదిలించడం కష్టం. మరి చూడాలి రాజధాని అంశంలో వైసీపీకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో?

Discussion about this post