గత రెండు దశాబ్దాలుగా కడప జిల్లా ఎప్పుడూ టీడీపీకి కొరుకుడు పడని జిల్లాగా ఉంటోంది. గతంలో ఎప్పుడూ ఒక్క సీటుతో సరిపెట్టుకుంటూ వస్తోన్న టీడీపీకి గత ఎన్నికల్లో ఆ ఒక్క సీటూ రాలేదు. పార్టీ ఓడిన గత రెండున్నరేళ్లలో జిల్లాలో మహామహులు అయిన నేతలే పార్టీకి దూరం దూరం ఉంటున్నారు. పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను పక్కన పెట్టినా వీడు దమ్మున్న లీడర్రా అని చెప్పుకునేందుకు ఒక్కడూ కూడా లేని దుస్థితి. ఇలాంటి టైంలో 2024లో జిల్లాలో గెలిచే ఫస్ట్ సీటు ప్రొద్దుటూరు అన్న టాక్ బలంగా వినిపిస్తుండడం కాస్త విశేషం లాంటిదే. టీడీపీలో కాదు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా ఈ మాటే ఇప్పుడు హైలెట్ అవుతోంది.

బాబు ఆశల్లో ‘ ఉక్కు ప్రవీణ్ ‘ హీరోయే…
1985 తర్వాత ఇన్నేళ్లలో ఇక్కడ 2009లో మాత్రమే టీడీపీ గెలిచింది. నాడు జిల్లాలో పార్టీ గెలిచిన ఏకైక సీటు. ఇక్కడ లింగారెడ్డి, వరదరాజులరెడ్డికి మార్చి మార్చి సీటు ఇచ్చినా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంలో నాయకులు విఫలమయ్యారు. అసలు ప్రొద్దుటూరులో పార్టీని నడిపించే సమర్థుడు అయిన నాయకుడు దొరుకుతాడా ? అనుకుంటోన్న టైంలో బాబుకు ఉక్కు ప్రవీణ్‌రెడ్డి టార్చ్‌లైట్ మాదిరిగా కనిపించాడు. ప్రజా ఉద్యమాల్లో తిరుగులేని నేతగా ఉక్కు ప్రవీణ్‌కు పేరుంది.

కడప స్టీల్ ప్లాంట్‌తో ఉక్కు ప్రవీణ్‌గా గుర్తింపు :
కడప స్టీల్ ప్లాంటు భిక్ష కాదు రాయలసీమ బిడ్డల హక్కు అంటూ గతంలో ఈ నినాదం ఎత్తుకున్న ప్రవీణ్ యువతను ఆలోచింపజేశాడు. కడప స్టీల్‌ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడిగా జిల్లా అంతటా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నారు. కేవలం కడప స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా అనంతపురం ఎయిమ్స్, వెనకబడిన రాయలసీమ అభివృద్ది కోసం ఆయన ఎత్తుకున్న నినాదం సీమలోనూ ఆయనకు యూత్‌లో మంచి పాపులార్టీ తెచ్చిపెట్టింది. నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా యువతలో ప్రవీణ్ పేరు మార్మోగుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ప్రవీణ్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఉద్యమం, ఆమరణ దీక్ష చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు ప్రవీణ్ పేరు వార్తల్లోకి వచ్చింది.

గత కొన్నేళ్లలో వెనకపడిన సీమ కోసం రాజకీయంగా అవుట్ డేటెడ్ అయిన నేతలో లేదా.. రాజకీయంగా ఏ అవకాశం లేక.. ఏదోలా వార్తల్లో నిలవాలనుకున్న నాయకులో మీడియా ముందుకు వచ్చి రెండు మాటలు మాట్లాడేసి మాయం అయ్యేవారు. అయితే ఉక్కు ప్రవీణ్ చేపట్టిన ఉక్కు పోరాటమే ఆయనకు ప్రజల్లో కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా తిరుగులేని హీరోను చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించడం ఒక ఎత్తు అయితే.. జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ కూడా పార్టీలో చేరి నియోజకవర్గంలో తక్కువ టైంలోనే పార్టీ కేడర్‌కు తలలో నాలుకలా మారారు. వెంటనే బాబు ప్రవీణ్ కష్టం గురించి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి కట్టబెట్టారు.

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వచ్చిన ఆరు నెలల్లోనే ప్రొద్దుటూరులో టీడీపీ సీన్ మారిపోయింది. పార్టీ కేడర్ మాత్రమే కాదు…. నియోజకవర్గంలో సామాన్య జనాల్లోనూ ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. విచిత్రం ఏంటంటే నియోజకవర్గంలో వైసీపీ కంచుకోటల్లాంటి గ్రామాల నుంచి కూడా టీడీపీలోకి వలసల జాతర మొదలైంది. మరోవైపు సీనియర్ల నుంచి సహకారం లేకపోయినా ప్రవీణ్ మాత్రం ఒంటిచేత్తో పార్టీని వైసీపీకి ధీటుగా మార్చేశారు. చంద్రబాబు ఇక్కడ పార్టీలో సీనియర్ల నుంచి ప్రవీణ్‌కు ఎలాంటి డిస్టబెన్స్‌లు లేకుండా చేస్తే ప్రొద్దుటూరులో 2024లో టీడీపీ బంపర్ విక్టరీ ఖాయమే. అదే సమయంలో ఇక్కడ అధికార పార్టీలో పరిణామాలు కూడా పార్టీకి మరింత ప్లస్ అవుతున్నాయి.

Discussion about this post