రాజకీయాలకు దూరమైన సరే సమయానికి తగ్గట్టుగా రాజకీయం నడిపించడంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌ని మించిన వారు లేరనే చెప్పొచ్చు. ఏంటో ఈయన కరెక్ట్‌గా జగన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే సమయంలోనే మీడియా సమావేశం పెట్టి హడావిడి చేసేస్తారు…పైకి రాష్ట్ర భవిష్యత్ కోసం మాట్లాడినట్లు ఉంటారు గాని…లోపల మాత్రం జగన్ భవిష్యత్ గురించి పోరాడుతున్నట్లు కనిపిస్తారు.

గత ఏడేళ్లుగా ఉండవల్లిది ఇదే వరుస…గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా…కరెక్ట్‌గా టైమ్ చూసుకుని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై నెగిటివ్ కామెంట్ చేసేవారు..అప్పుడు పరోక్షంగా జగన్‌కు లబ్ది చేకూర్చేలా మాట్లాడేవారు. అయితే ఇప్పుడు కూడా ఉండవల్లి మీడియా సమావేశాలు పెడుతున్నారు..కాకపోతే జగన్‌ని పరోక్షంగా కాపాడుతున్నట్లు కనిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా సరే…ఏదో జగన్‌ని విమర్శించాలా? వద్దా? అన్నట్లే మాట్లాడతారు.

కరెక్ట్‌గా ఆయన మీడియా సమావేశాలు గమనిస్తే…జగన్‌కు పరోక్షంగా సపోర్ట్ ఇచ్చినట్లే ఉంటాయి. అసలు జగన్‌కు భారీ మెజారిటీ ఉంది..ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు..ఆయన ఏదైనా చేయొచ్చు అని అంటుంటారు. పైగా జగన్‌పైన ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ చేయాలంటే..డైరక్ట్‌గా చేయరు…చంద్రబాబుని లాగి చేస్తారు. అప్పుడు చంద్రబాబు అలా చేశారు..ఇప్పుడు జగన్ అలాగే చేస్తున్నారని మాట్లాడతారు.

ముఖ్యంగా తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఉండవల్లి కామెంట్స్ చేశారు. పోలవరం నిర్మాణం కేంద్రం బాధ్యత అని, కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం తప్పు అని ఉండవల్లి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తి అవుతుందని చంద్రబాబు తీసుకున్నారు…అందుకు తగ్గట్టుగానే పనిచేశారు…కానీ జగన్ ఏ మాత్రం పోలవరం పనులు ముందుకు వెళ్లనివ్వడం లేదు.

ఆ విషయం ఉండవల్లి చెప్పకుండా…చంద్రబాబు తప్పు చేశారని, జగన్ కూడా అదే తప్పు చేస్తున్నారని అంటున్నారు. అసలు పోలవరం నిర్మాణం వేగంగా పూర్తి చేయడంలేదు…కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నారని జగన్ అసమర్ధత గురించి మాత్రం మాట్లాడారు. అంటే ఉండవల్లి బాధ అంతా జగన్ కోసమే అనిపిస్తూ ఉంటుంది.

Discussion about this post