ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి ముసుగులో జగన్ కు అండగా ఉండే నేత. రాజకీయాల నుంచి దూరమైన..జగన్ కోసం ఉండవల్లి తాపత్రయ పడుతూనే ఉన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా..చంద్రబాబు ప్రభుత్వంపై ఉండవల్లి ఎలా బురద జల్లేవాడో అందరికీ తెలిసింది. బాబుని నెగిటివ్ చేసి..జగన్‌కు పాజిటివ్ చేశారు. ఇక జగన్ గెలిచి అధికారంలోకి వచ్చాక…జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తక్కువ. ఇక ఇప్పుడు జగన్ కు తాను మద్ధతు పలుకుతున్నానని ముసుగు తీశాడు.
ఇక పై జగన్ ని విమర్శించనని ఉండవల్లి చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల పాటు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయనని, ఎందుకు విమర్శలు చేయవని అడిగే వారికి ఆ అర్హత లేదని, ఏపీ పునర్విభజన అంశంలో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ తనకు బలాన్ని ఇచ్చిందని, మార్గదర్శితో పాటుగా పోలవరం సహా అన్ని అంశాలపైన టీడీపీతో చర్చకు సిద్దమని చెప్పారు.

అంటే మార్గదర్శి కేసులో జగన్..రామోజీ టార్గెట్ గా ముందుకెళ్లడం ఉండవల్లికి కావాల్సింది. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే అందులో తప్పులు జరిగితే వ్యవస్థలు తెలుస్తాయి. కానీ ఇందులో ఉండవల్లి ఇంటరెస్ట్ ఏంటి అనేది అర్ధమవుతుంది. అందుకే జగన్ ని విమర్శించనని చెబుతున్నారు. ఇంకా ఇందులో గొప్ప విషయాలు ఏమి లేవు..ప్రజలకు మేలు చేసేది ఏమి లేదు. అసలు జగన్ పాలన వల్ల ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు..ప్రతిపక్షాలని ఎలా అణిచివేసే కార్యక్రమం జరుగుతుంది..ఒక మేధావిగా వాటిపై పోరాటం చేయకుండా..మార్గదర్శి కేసులో జగన్…రామోజీని ఇరుకున పెడుతున్నారని, ఇంకా జగన్ పై విమర్శలు చేయనని అనడం వెనుక రాజకీయం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పైగా ఉండవల్లి..జగన్ మనిషి అని ఇప్పుడు క్లియర్ గా బయటపడింది. అయినా గత ఎన్నికల ముందు అంటే ఉండవల్లి ఎన్ని అబద్దాలు చెప్పిన ప్రజలు నమ్మారు..కానీ ఇప్పుడు ఉండవల్లి మాటలని ప్రజలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఉండవల్లితో టిడిపికి పోయేదేమీ లేదు.