తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఇక్కడ 1983 నుంచి తెలుగుదేశం జెండా ఎగురుతూనే వస్తుంది..మధ్యలో 2004 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ టీడీపీ ఓడిపోయింది..ఆ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. అయితే ఇప్పటికీ ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ సీటు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి దక్కనుంది అనేది పెద్ద ట్విస్ట్.

అదేంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు కదా..ఆయనకే సీటు. ఎలాగో చంద్రబాబు కూడా సిట్టింగులకే సీటు అని ప్రకటించారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. వాస్తవానికి ఈ సీటు వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ)ది. 2009, 2014లో ఉండి ఆయనే గెలిచారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు శివని నరసాపురం ఎంపీగా పంపించారు. అప్పటివరకూ టీడీపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు వైసీపీలోకి వెళ్ళి పోటీ చేయడంతో శివని తప్పక టీడీపీ నుంచి బరిలో దింపాల్సి వచ్చింది. కానీ రఘురామ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

శివ నరసాపురం వెళ్ళడంతో ఉండిలో శివ బంధువైన మంతెన రామరాజుని పోటీకి దింపారు. ఇక్కడ రామరాజు గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటు రఘురామకే దక్కనుంది. ఆయన టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో శివ మళ్ళీ ఉండి సీటు అడుగుతున్నారు.

దీంతో కన్ఫ్యూజన్ వచ్చింది. ఇద్దరిలో ఎవరోకరు త్యాగం చేయాలి. శివకు సీటు ఇస్తే రామరాజు సైడ్ అవ్వాలి. రామరాజుకు సీటు ఇస్తే శివకు వేరే పదవి ఇవ్వాలి. మరి బాబు ఉండి సీటుని ఎవరికిస్తారో చూడాలి.

Leave feedback about this