గన్నవరంలో ఇటీవల ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే…టిడిపి నేత ఇంటిపై, టిడిపి ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేసిన విషయం తెలిసిందే. వీటికి నిరసనగా రోడ్డు ఎక్కిన టిడిపి శ్రేణులపై మళ్ళీ వంశీ అనుచరులు దాడులు చేయడానికి రావడం, అక్కడ టిడిపి శ్రేణులు ప్రతిఘటించడంతో..రెండు వర్గాల మధ్య యుద్ద వాతావరణం నడిచింది. కానీ ఇంత జరిగిన పోలీసులు అరెస్ట్ చేసింది టిడిపి నేత పట్టాభిని, టిడిపి నేతలని…పైగా పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారట..ఆ విషయాన్ని తాజాగా కోర్టుకు వచ్చిన పట్టాభి..తన చేతులుకు ఉన్న గాయాలని చూపించారు.

దీంతో మొత్తానికి పట్టాభిని కొట్టారనే విషయం మాత్రం అర్ధమైంది. అయితే ఈ అంశంపై టిడిపి బాగా సీరియస్ గా ఉంది. వంశీ టార్గెట్ గా వరుసపెట్టి టిడిపి నేత ఫైర్ అయిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే రాష్ట్ర స్థాయిలో గన్నవరంలో టిడిపి ఆఫీసుపై దాడికి నిరసనలు తెలియజేశారు. అలాగే చంద్రబాబు వెంటనే కృష్ణా జిల్లాకు వచ్చారు. పట్టాభి ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. ఇదే సమయంలో గన్నవరంలో వంశీకి చెక్ పెట్టే బలమైన నేతని రంగంలోకి దింపడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

ఎదురుదెబ్బలు తిన్న టిడిపి తగ్గడం లేదు. అయితే అధికార బలంతో వంశీ ముందుకెళుతున్నారు..కానీ ఆయన సొంత పార్టీ నుంచే సపోర్ట్ లేదు. గన్నవరం ఎపిసోడ్‌కు సంబంధించి టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు..పట్టాభికి మద్ధతుగా నిలిచారు. కానీ వంశీకి మద్ధతుగా ఒక్క వైసీపీ నేత మాట్లాడలేదుల. అటు గన్నవరంలోనే ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు స్పందించలేదు. దీని బట్టి చూస్తే వైసీపీలో వంశీ ఒంటరి అయ్యారనే చెప్పవచ్చు.
