March 22, 2023
అర్బన్ సీట్లలో వైసీపీకి టీడీపీ చెక్?
ap news latest AP Politics Politics TDP latest News YCP latest news

అర్బన్ సీట్లలో వైసీపీకి టీడీపీ చెక్?

ఏపీలో ఉన్న నగరాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు సాధిస్తుంది..ఈ సారి ఎన్నికల్లో అర్బన్ స్థానాల్లో టి‌డి‌పి సత్తా చాటేలా ఉంది. సిటీ సీట్లలో వైసీపీకి చెక్ పెట్టి టి‌డి‌పి గెలిచేలా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా అర్బన్ సీట్లలో టి‌డి‌పి బాగానే గెలిచింది. విశాఖ సిటీలో నాలుగు సీట్లు, రాజమండ్రి అర్బన్, విజయవాడ ఈస్ట్, గుంటూరు వెస్ట్ సీట్లని గెలుచుకుంది.

అయితే ఈ సారి ఎన్నికల్లో ఇంకా కొన్ని సిటీ సీట్లలో వైసీపీకి టి‌డి‌పి చెక్ పెట్టేలా ఉంది. ఇప్పుడు వస్తున్న సర్వేల్లో అర్బన్ సీట్లలో టి‌డి‌పికే లీడ్ అని తేలింది. శ్రీకాకుళం, విజయనగరం స్థానాల్లో టి‌డి‌పి గెలుపు ఖాయమని తేలింది. అయితే విశాఖ సిటీలో రెండు సీట్లు టి‌డి‌పి, రెండు సీట్లు వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉందని తేలింది. ఇక్కడ జనసేనతో పొత్తు ఉంటే వైసీపీకి నాలుగు సీట్లలో చెక్ పడుతుంది. కాకినాడ సిటీ సీటులో కూడా అదే పరిస్తితి.

ఇక రాజమండ్రి సిటీలో మళ్ళీ టి‌డిపిదే గెలుపు అని తేలింది. ఇటు ఏలూరు సిటీలో వైసీపీకి ఎడ్జ్ ఉంది..కానీ టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ గెలవడం కష్టమే. అటు విజయవాడ సిటీలో మూడు సీట్లు ఉన్నాయి. ఈస్ట్, సెంట్రల్ సీట్లు టి‌డి‌పి ఖాతాలో పడనున్నాయి. జనసేనతో పొత్తు ఉంటే వెస్ట్ సీటు కూడా కైవసం చేసుకోవచ్చు. గుంటూరు ఈస్ట్ లో వైసీపీకి, వెస్ట్ లో టి‌డి‌పికి ఎడ్జ్ ఉంది. టి‌డి‌పి-జనసేన కలిస్తే రెండు సీట్లు గెలుచుకోవచ్చు. ఒంగోలు, నెల్లూరు సిటీ సీట్లు టి‌డి‌పి ఖాతాలో పడటం ఖాయమని తేలింది.అటు తిరుపతి సీటులో వైసీపీకి ఎడ్జ్ ఉంది..కాకపోతే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి గెలుపు డౌటే. అనంతపురం అర్బన్ లో టి‌డి‌పికే లీడ్. కర్నూలు సిటీలో టి‌డి‌పి-వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. కడప సిటీ వైసీపీ ఖాతాలోనే పడనుంది. అయితే మెజారిటీ అర్బన్ సీట్లు టి‌డి‌పి ఖాతాలో పడనున్నాయి..పొత్తు ఉంటే 90 శాతం సీట్లు గెలవచ్చు.