సాధారణంగా మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా వస్తుందనే చెప్పాలి..మంత్రులుగా రాష్ట్రంలో అధికారం చెలాయించే క్రమంలో సొంత నియోజకవర్గాలని పట్టించుకోరు..అందుకే మంత్రులు మళ్ళీ గెలవడం కష్టమవుతుంది. ఏదో కొద్ది మంది మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇపుడు ఏపీలో మంత్రుల పరిస్తితి కూడా అంతే..మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు..కానీ వారిలో గెలుపు గుర్రం ఎక్కేవారు తక్కువగానే కనిపిస్తున్నారు.
మెజారిటీ మంత్రులు ఓటమి దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో ఉన్న ఆరుగురు మంత్రుల్లో ఈ సారి ఒకరిద్దరు మినహా మిగిలిన వారు గెలవడం కష్టమనే పరిస్తితి. ఉత్తరాంధ్రలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు..విజయనగరంలో రాజన్న దొర, బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు. ఇక వీరిలో ఓటమి అంచున ఉన్నవారిలో గుడివాడ ముందు ఉన్నారు. మంత్రిగా ఈయన చేసిందేమి లేదు..పైగా అన్నీ వివాదాస్పద కామెంట్లు,. దీంతో ఆయన సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నారు.

ఇక ఈయన సొంత స్థానం అనకాపల్లిలో కూడా నెక్స్ట్ గెలవడం కష్టమని సర్వేలు తేల్చేసాయి..దీంతో సీటు మార్చుకోవాలని చూస్తున్నారు. అటు ముత్యాలనాయుడు..ఇక ఈయన మంత్రి అనే సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కనీసం రాజకీయాలు తెలిసినవారికి కూడా తెలియదంటే..ఆయన పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మాడుగులలో ఈయనకు గెలుపు అవకాశాలు తక్కువే.
అటు శ్రీకాకుళంలో మంత్రి ధర్మానకు, పలాసలో అప్పలరాజుకు తీవ్ర వ్యతిరేకత ఉంది..ఈ సారి వీరు గట్టెక్కే అవకాశాలు లేవు. చీపురుపల్లిలో మళ్ళీ బొత్సకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు సాలూరులో రాజన్న దొరకు అంత అనుకూల వాతావరణం లేదు గాని..అక్కడ టిడిపి బలంగా లేకపోవడమే రాజన్నకు ప్లస్. టిడిపి బలపడితే రాజన్నకు గెలుపు డౌటే. మొత్తానికి బొత్స తప్ప అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు.
